Homeఎంటర్టైన్మెంట్Jana Nayagan: 'జన నాయగన్' రిలీజ్ కి సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్..? విడుదల తేదీ...

Jana Nayagan: ‘జన నాయగన్’ రిలీజ్ కి సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్..? విడుదల తేదీ ఇదే!

Jana Nayagan: తమిళ స్టార్ హీరో విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ చిత్రం ‘జన నాయగన్'(Jana Nayagan Movie) విడుదలకు మోక్షం లభించినట్టేనా?, అంటే అవుననే అంటున్నారు తమిళ వర్గాలు. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వాల్సిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించింది. అప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రపంచవ్యాప్తంగా మొదలై దాదాపుగా 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చింది. మరో రెండు రోజుల్లో […]

Jana Nayagan: తమిళ స్టార్ హీరో విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ చిత్రం ‘జన నాయగన్'(Jana Nayagan Movie) విడుదలకు మోక్షం లభించినట్టేనా?, అంటే అవుననే అంటున్నారు తమిళ వర్గాలు. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వాల్సిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించింది. అప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రపంచవ్యాప్తంగా మొదలై దాదాపుగా 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చింది. మరో రెండు రోజుల్లో విడుదల అనగా, సినిమాలో మాత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా చాలా సన్నివేశాలు ఉన్నాయని , వాటిని తొలగిస్తేనే సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తామని బోర్డు మెంబెర్స్ చెప్పడం, దీంతో మూవీ టీం హై కోర్టు కి వెళ్లడం వంటివి జరిగింది. హైకోర్టు కూడా సెన్సార్ బోర్డు సభ్యులు చెప్పైనా మాటలకు ఏకీభవించడంతో, ఇక చేసేది ఏమి లేక, నిర్మాత కేసు వెనక్కి తీసుకున్నాడు.

సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసిన ఆ 20 నిమిషాల సన్నివేశాలను తొలగించడానికి నిర్మాతలు అంగీకరించారు. అంతే కాకుండా సెన్సార్ బోర్డు సూచించినట్లు కొన్ని డైలాగ్స్ ని కూడా మ్యూట్ చేయడానికి నిర్మాతలు అంగీకరించారట. రీసెంట్ గానే ఆ పనులు పూర్తి చేశారు. ఇప్పుడు ఈ కొత్త వెర్షన్ ని సెన్సార్ బోర్డు కి పంపించి, తమపై వేసిన కేసులను ఉపసంహరించుకోవాలని రిక్వెస్ట్ చేయబోతున్నట్టు సమాచారం. ఈరోజు, లేదా రేపు ఈ చిత్రం లేటెస్ట్ వెర్షన్ ని సెన్సార్ బోర్డు కు పంపబోతున్నారట మేకర్స్. సెన్సార్ నుండి సర్టిఫికేట్ రాగానే, ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారా. ఫిబ్రవరి 20 న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తోంది. మరి నిర్మాతలు అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతాయా?, లేదా మధ్యలో ఏమైనా ట్విస్టులు వస్తాయా అనేది చూడాలి. విజయ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు.

ఇది మన టాలీవుడ్ లో అనిల్ రావిపూడి, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి రీమేక్ అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం నడుస్తున్న పాన్ ఇండియన్ మూవీస్ ట్రెండ్ లో రీమేక్ సినిమాలను జనం చూడడం పూర్తిగా మానేశారు. కానీ విజయ్ కి ఇదే చివరి చిత్రం అవ్వడంతో, రీమేక్ అయినప్పటికీ ఈ సినిమాపై మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈసారి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెడితే , ఇంతకు ముందుకంటే బెటర్ ట్రెండ్ ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ సినిమా తర్వాత ఇక విజయ్ సినిమాలు చేసే అవకాశమే లేదు. ఈ విషయాన్ని రీసెంట్ గా ఒక నేషనల్ మీడియా ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు విజయ్. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి, ‘జన నాయగన్ ‘ కి ఎదురయ్యే సమస్యలు, భవిష్యత్తులో నా ప్రతీ సినిమాకు వస్తుంది, నా వల్ల నిర్మాతలు నష్టపోవడం ఇష్టం లేకనే ఏ నిర్ణయం తీసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు విజయ్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper