Homeఎంటర్టైన్మెంట్Jailer 2 Overseas Review: 'జైలర్ 2' ఓవర్సీస్ ప్రివ్యూ షో టాక్ వచ్చేసింది..అంచనాలు తారుమారు...

Jailer 2 Overseas Review: ‘జైలర్ 2’ ఓవర్సీస్ ప్రివ్యూ షో టాక్ వచ్చేసింది..అంచనాలు తారుమారు అయ్యాయి!

Jailer 2 Overseas Review: సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ కి ‘జైలర్’ చిత్రం ఎంతలా ఉపయోగపడిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు ముందు వరుసగా ఆయనకు డిజాస్టర్ ఫ్లాప్స్ ఎదురయ్యాయి. వయస్సు వచ్చేసింది , సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి , ఇక రజినీకాంత్ పని అయిపోయింది అని అంతా అనుకుంటున్నా సమయం లో ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై 650 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. […]

Jailer 2 Overseas Review: సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ కి ‘జైలర్’ చిత్రం ఎంతలా ఉపయోగపడిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు ముందు వరుసగా ఆయనకు డిజాస్టర్ ఫ్లాప్స్ ఎదురయ్యాయి. వయస్సు వచ్చేసింది , సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి , ఇక రజినీకాంత్ పని అయిపోయింది అని అంతా అనుకుంటున్నా సమయం లో ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై 650 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. అలాంటి హిస్టారికల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ ఉంటుంది అని చెప్పిన రోజే , ‘జైలర్ 2’ పై మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ కి తగ్గట్టుగానే ప్రమోషనల్ కంటెంట్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎప్పటి లాగానే అనిరుద్ అదిరిపోయే రేంజ్ మ్యూజిక్ అందించాడు. ట్రైలర్ కూడా పర్వాలేదు అనిపించింది.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షో ని రీసెంట్ గానే లండన్ లో ప్రదర్శించారట. ఓవర్సీస్ బయ్యర్స్ తో పాటు , పలువురు ప్రముఖులు ఈ ప్రివ్యూ షో లో పాల్గొన్నారు. వీళ్ళ నుండి వచ్చిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ట్రైలర్ ని చూసి ప్రేక్షకులు , అభిమానులు కాస్త నిరాశకు గురి అయ్యుంటారు కానీ , సినిమా మాత్రం అలా లేదని , ఫస్ట్ హాఫ్ నెల్సన్ దిలీప్ కుమార్ తన మార్కు ఎలివేషన్స్ తో రజినీకాంత్ ని వేరే లెవెల్ లో చూపించారని , ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నడిపించాడని అంటున్నారు. జైలర్ చిత్రం లోని ఇంటర్వెల్ సన్నివేశం అభిమానులకు అప్పట్లో గూస్ బంప్స్ రప్పించాయి. థియేటర్స్ బ్లాస్ట్ అయ్యాయి. ‘జైలర్ 2’ లోని ఇంటర్వెల్ సన్నివేశం అంతకు మించి ఉందని టాక్.

ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే , రెండు కీలకమైన ట్విస్టులు వస్తాయని , ఆ ట్విస్టులు థియేటర్ లో చూసే ప్రేక్షకులకు ఒక అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని ఇస్తాయని అంటున్నారు. ఇక క్లైమాక్స్ లో హృతిక్ రోషన్ క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చిందట. నేను మీ స్టూడెంట్ ని సార్ అంటూ ఆయన పలికే డైలాగ్స్ అదిరిపోతాయని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే జైలర్ చిత్రం యాక్షన్ ఎంత బాగుంటుందో , న్యాచురల్ గా వచ్చే కామెడీ కూడా అంతే బాగుంటుంది. ‘జైలర్ 2’ లో కూడా అలాంటి కామెడీ ని రిక్రియెట్ చేయడానికి ప్రయత్నం చేశారట, ఆ కామెడీ పర్వాలేదని అంటున్నారు, కానీ జనాలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఓవరాల్ హిట్ సినిమా అని , కచ్చితంగా 600 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబడుతుందని అంటున్నారు. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అన్ని ప్రాంతాల్లో మొదలయ్యాయి. కూలీ రేంజ్ బుకింగ్స్ దీనికి లేవు కానీ , డీసెంట్ రేంజ్ లో ఉన్నాయని చెప్పొచ్చు. పాజిటివ్ టాక్ వస్తే మొదటి రోజు 120 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ‘జైలర్ 2’ పై మీ అంచనాలు ఏంటి?, ఏ థియేటర్ లో మీరు ఈ సినిమాని చూద్దామని అనుకుంటున్నారో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper