Homeఎంటర్టైన్మెంట్Zayn Marie Khan: అమీర్ ఖాన్ మేనకోడలు ని చితకబాదిన ముంబై పోలీసులు!

Zayn Marie Khan: అమీర్ ఖాన్ మేనకోడలు ని చితకబాదిన ముంబై పోలీసులు!

Zayn Marie Khan: గత కొద్దిరోజులుగా ఎన్నికల కమీషన్ పై నిరసన వ్యక్తం చేస్తూ కాక్రోక్ జనతా పార్టీ అద్వర్యం లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ముంబై లోని ఆగస్టు క్రాంతి మైదాన్ వద్ద శనివారం జరిగిన నిరసనలో ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మేనకోడలు , నటి జైన్ మేరీని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన పెద్ద సంచలనం గా మారింది. రిమాండ్ లో పోలీసులు […]

Zayn Marie Khan: గత కొద్దిరోజులుగా ఎన్నికల కమీషన్ పై నిరసన వ్యక్తం చేస్తూ కాక్రోక్ జనతా పార్టీ అద్వర్యం లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ముంబై లోని ఆగస్టు క్రాంతి మైదాన్ వద్ద శనివారం జరిగిన నిరసనలో ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మేనకోడలు , నటి జైన్ మేరీని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన పెద్ద సంచలనం గా మారింది. రిమాండ్ లో పోలీసులు ఈమెని విచారించి, ఆ తర్వాత వదిలేశారు. అయితే సోషల్ మీడియా లో ఈమె అప్లోడ్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పోలీసులు తనతో చాలా దురుసుగా వ్యవహరించారని , లాఠీ ఛార్జ్ కూడా చేసారంటూ తనకు తగిలిన గాయాలకు సంబంధించిన ఫోటోలను మీడియా కి చూపించింది.

అనంతరం ఆమె మాట్లాడుతూ ‘మమ్మల్ని ఎక్కువ భయపెట్టాలని చూడకండి , మాలో అసలు భయం అనేదే లేకుండా పోతుంది’ అంటూ కామెంట్స్ చేసింది. దీనిపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ పలు విధాలుగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ సపోర్టర్స్ జైన్ కి సపోర్టుగా నిలుస్తుండగా , బీజీపీ సపోర్టర్స్ మాత్రం ఇవన్నీ నాటకాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తన సోదరి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకి అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ నిరసన మొదలు పెట్టాడు. సిఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చెయ్యాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. దీంతో ఇమ్రాన్ ఖాన్ ని కూడా పోలీసులు అదుపులోకి కాసేపటి క్రితమే తీసుకున్నారు. ఒక వ్యాన్ లో ఈయన్ని పోలీస్ స్టేషన్ కి తరలించారు. కాసేపు విచారించి వదిలేశారు. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అమీర్ ఖాన్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. చిన్నపిల్లలకు ఉన్న ధైర్యం కూడా అమీర్ ఖాన్ కి లేకుండా పోయింది అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక జైన్ మేరీ విషయానికి వస్తే ఈమె బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఈ ఏడాది అడివి శేష్ హీరో గా నటించిన ‘డెకాయిట్’ చిత్రం లో కూడా ఈమె కీలక పాత్ర పోషించింది. సినిమాల్లో బిజీ గా ఉంటూ వస్తున్న ఈమె , ఇప్పుడు ఏకంగా ప్రధాన మంత్రికి ఎదురు తిరగడం ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. ఇక ఇమ్రాన్ ఖాన్ విషయానికి వస్తే , ఈయన 2008 వ సంవత్సరం లోనే ఇండస్ట్రీ లోకి హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఒకటి రెండు సూపర్ హిట్స్ ఉన్నాయి కానీ, ఎందుకో ఇండస్ట్రీ లో ఒక స్టార్ గా స్థిరపడలేకపోయాడు. 2015 వరకు యాక్టీవ్ గా సినిమాలు చేస్తూ వచ్చిన ఈయన , అకస్మాత్తుగా సినిమాలకు దూరం అవ్వడం విశేషం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper