Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి మంచి వైల్డ్ ఫైర్ తో నిన్న 5 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. వీళ్ళు వచ్చిన తర్వాత హౌస్ లో పరిణామాలతో పాటు , ఓటింగ్ లో కూడా భారీ మార్పులు ఉండబోతున్నాయి. ఇప్పటికే హౌస్ మూడు గ్రూపులు గా విడిపోయాయి. ఒకటి రోహిత్ గ్రూప్ కాగా , త్రిగున్ , ముకేశ్ గ్రూపులు మరో వైపు. ఇప్పుడు ఈ వైల్డ్ కార్డ్స్ మరో కొత్త గ్రూప్ ని క్రియేట్ చేయబోతున్నారా?, లేదా వీళ్ళే మిగిలిన గ్రూప్స్ కి షిఫ్ట్ అవుతారా అనేది చూడాలి. ప్రస్తుతానికి అయితే నీతూ మాస్టర్ రోహిత్ వైపు చాలా పాజిటివ్ గా ఉంది. కానీ రోహిత్ తో చాలా క్లోజ్ గా ఉన్న షాలిని తో నీతూ మాస్టర్ కి పడడం లేదు. వీళ్ళు ఒక గ్రూప్ గా ఎలా మారుతారో చూడాలి.
ఒకవేళ నీతూ మాస్టర్ రోహిత్ తో గ్రూప్ కడితే గేమ్ చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఇకపోతే రామకృష్ణ కి సోషల్ మీడియా తో పాటు బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్స్ లో కూడా సానుభూతి చాలా గట్టిగా ఉంది. నిన్న ఏ వైల్డ్ కార్డు కంటెస్టెంట్ కి పలకని రేంజ్ లో రామకృష్ణ కి స్వగతం పలికారు హౌస్ మేట్స్. ఇతను కచ్చితంగా రోహిత్ టీం తో చేతులు కలుపుతాడని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే రామ్ ప్రసాద్ , నరేష్ లతో ఎక్కువగా ఉంటున్నాడు. రాబోయే రోజుల్లో సెలబ్రిటీలతో ఏకమయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే కనుక జరిగితే రామకృష్ణ నెగెటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సెలబ్రిటీలు ఎక్కువగా ‘అగ్ని పరీక్ష 2’ కంటెస్టెంట్స్ ని తమ అవసరాలకు వాడుకొని వదిలేస్తున్నారు . ఉదాహరణకు అమన్. గత వారం అద్భుతంగా టాస్కులు ఆడాడు , కానీ అతన్ని కెప్టెన్సీ కంటెండర్ అవ్వనివ్వకుండా చేశారు. రేపు రామకృష్ణ పరిస్థితి కూడా అంతే అని అంటున్నారు విశ్లేషకులు.
ఇక మిగిలిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ లో దక్షి స్టేజి మీద రోహిత్ అంటే నాకు చాలా ఇష్టమని చెప్పింది కానీ , హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఆమె ఎక్కువగా సెలబ్రిటీస్ తోనే ఉంటుంది, ఇక శ్వేతా నాయుడు, శివ్ కుమార్ లు కూడా ఎక్కువగా సెలబ్రిటీలతోనే ఉంటున్నారు. ఇలా ఉండడం వల్ల రోహిత్ ని టార్గెట్ చేసినట్టుగా ఆడియన్స్ ఎదో ఒక సందర్భం లో అనిపిస్తుంది. ఇప్పటికే అతని గ్రాఫ్ ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తులో ఉంది. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ కూడా ఆ గ్రాఫ్ ని ఎక్కడికో తీసుకెళ్లేలా ఉన్నారని అంటున్నారు విశ్లేషకులు. ఇదంతా పక్కన పెడితే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తర్వాత ఓటింగ్ లో కూడా భారీ మార్పులు చోటు చేసుకోవచ్చని అంటున్నారు విశ్లేషకులు.
ఉదాహరణకు రామకృష్ణ కి మంచి సానుభూతి ఓటింగ్ ఉంది. ప్రస్తుతం రోహిత్ తర్వాత ఇతనే రెండవ స్థానం లో ఉన్నాడు. నిన్న మొన్నటి వరకు రోహిత్ , త్రిగున్ మాత్రమే మొదటి రెండు స్థానాల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు త్రిగున్ స్థానం లోకి రామకృష్ణ వచ్చాడు. రాబోయే రోజుల్లో రామకృష్ణ కి రెండు మంచి టాస్కులు పడినా అతను రోహిత్ ని కూడా దాటే అవకాశాలు ఉన్నాయి. ఇక శివ్ కుమార్ కారణంగా ముకేశ్ ఓటింగ్ లో కూడా భారీ మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే ముకేశ్ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ కి ముందు మూడవ స్థానం లో ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆయన ఆట బాగా తగ్గిపోయింది , అదే సమయం లో వైల్డ్ కార్డ్స్ లో శివ్ కుమార్ లాంటి మంచి పొటెన్షియల్ ప్లేయర్ ఉన్నాడు. ఈయన ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్ ‘ లో ఏ రేంజ్ లో గేమ్స్ ఆడాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘బిగ్ బాస్ 10’ లో ఆ రేంజ్ గేమ్ 10 శాతం చూపించినా ముకేశ్ ని దాటేసే ప్రమాదం ఉంది. ఇలా టాప్ 5 లో అనూహ్యమైన మార్పులు రాబోయే రోజుల్లో మనం చూడవచ్చు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.