Homeఎంటర్టైన్మెంట్NTR and Prashanth Neel controversy: ఎన్టీఆర్ వల్ల ప్రశాంత్ నీల్ తిట్లు తింటున్నాడా..?

NTR and Prashanth Neel controversy: ఎన్టీఆర్ వల్ల ప్రశాంత్ నీల్ తిట్లు తింటున్నాడా..?

NTR and Prashanth Neel controversy: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా పెను సంచలనాలను క్రియేట్ చేసే విధంగా కనిపిస్తుంది. రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు…దాంతో పాటుగా ఈ గ్లింప్స్ లో ఏ మూవీ వరల్డ్ మొత్తాన్ని పరిచయం చేశారు. సినిమా ఎలా ఉండబోతుంది హీరో దేనికోసం ఫైట్ చేయబోతున్నాడనే విషయాన్ని కూడా చాలా […]

NTR and Prashanth Neel controversy: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా పెను సంచలనాలను క్రియేట్ చేసే విధంగా కనిపిస్తుంది. రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు…దాంతో పాటుగా ఈ గ్లింప్స్ లో ఏ మూవీ వరల్డ్ మొత్తాన్ని పరిచయం చేశారు. సినిమా ఎలా ఉండబోతుంది హీరో దేనికోసం ఫైట్ చేయబోతున్నాడనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. మొత్తానికైతే ప్రశాంత్ నీల్ మరోసారి ఒక డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ చేసిన ప్రతి సినిమా ప్రేక్షకుడిని విశేషంగా అలరించింది. ముఖ్యంగా ఆయనలోని దర్శకుడిని పూర్తిస్థాయిలో ఎలివేట్ చేస్తూ ఒక హీరో నుంచి ఏం కావాలో దానిని పూర్తిస్థాయిలో రాబట్టుకుంటారు. అందుకే అతని సినిమాల్లో క్వాలిటీ ఉంటుంది. హీరో క్యారెక్టర్ లో ఒక నిజాయితీ ఉంటుంది. ఇక ఎలివేషన్స్ ఎమోషన్స్ ను సైతం ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ ఉంటాయి. ఇప్పటివరకు ఏ హీరో అతనితో సినిమా చేసిన కూడా వాళ్ళకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను అందించాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ను సైతం డిఫరెంట్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.

ఎన్టీఆర్ లుక్కు కోసం తన బాడీ ని బిల్డ్ చేయమని చెప్తే ఎన్టీఆర్ బాగా సన్నబడి పోయాడు. ఈ విషయంలో ఎన్టీఆర్ భార్యతో పాటు అతని అభిమానులు కూడా నన్ను తిట్టుకున్నారు అంటూ ప్రశాంత్ నీల్ చెప్పారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని అంతలా సన్నబడమని చెప్పలేదట.

కేవలం బాడీ పెంచాలి అని చెప్పాడట. కానీ ఆయన తన డెడికేషన్ తో సన్నబడి మరి బాడీని బిల్డ్ చేసుకున్నాడు… సినిమా అంటే అతనికి చాలా పిచ్చని, నటన మీద అతనికి చాలా పట్టు ఉందని ఎలాంటి పాత్రనైనా సరే పోషించగలిగే కెపాసిటి ఎన్టీఆర్ కి ఉందని ప్రశాంత్ నీల్ అతని గురించి చాలా గొప్పగా చెప్పాడు.

ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత్ నీల్ ను ఎన్టీఆర్ అభిమానులు తారక్ రూపం మార్చేశాడని తిట్టడం కాదు సినిమా రిలీజ్ లేట్ అవుతుందని కూడా తిడుతున్నారట. బెస్ట్ క్వాలిటీ తో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆయన చాలావరకు సమయాన్ని కేటాయించి మరి ఎన్టీఆర్ కి ఒక బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నారట…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper