NTR Prashanth Neel Movie Updates: ప్రస్తుతం ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ఇక ఇప్పుడున్న తెలుగు స్టార్ హీరోలందరిలో జూనియర్ ఎన్టీఆర్ కొంతవరకు వెనకబడిపోతున్నాడనే చెప్పాలి. గత సంవత్సరం దేవర సినిమాతో పాన్ ఇండియాలో 500 కోట్లు మాత్రమే కొల్లగొట్టిన ఆయన తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాను అంటూ గతంలో కొన్ని కామెంట్స్ అయితే చేశాడు. మరి ఇప్పుడున్న స్టార్ హీరోలందరు అతని కంటే ముందు వరుసలో ఉండడం వల్ల రాబోయే సినిమాలతో ఆయన ఎలాంటి విజయాలను సాధిస్తాడో దాన్నిబట్టి అతని మార్కెట్ అనేది క్రియేట్ అవుతోంది. రీసెంట్ గా భారీ హైప్ తో వచ్చిన ‘వార్ 2’ సినిమా ఆయన కెరియర్ కి ఏ మాత్రం ఉపయోగకరంగా లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి.
ఇక దీంతో ఎన్టీఆర్ అభిమానులు సైతం తను చేయబోతున్న సినిమా విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ కి సైతం పెర్సనల్ గా కొంతమంది మెసేజ్ లు కూడా పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో చాలా ఎక్స్ట్రా ఆర్డినర్ గా కనిపించాలి. అలాగే 2000 కోట్లకు పైన కలెక్షన్లు కొల్లగొట్టే విధంగా సినిమా డిజైన్ చేయండి సార్ అంటూ అతనికి మెసేజ్ లైతే చేస్తున్నారట.
Also Read: కూలీ 1000 కోట్లు కొడుతుందా..? రజినీకాంత్ కి ఇలాంటి సినిమా ఇవ్వడం కరెక్టేనా..?
ఇక ఇలాంటి క్రమంలోనే ఎన్టీఆర్ తన తదుపరి సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. అలాగే తన అభిమానులను సంతోష పెడతాడా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ప్రశాంత్ నీల్ గతంలో చేసిన సినిమాలన్నీ యాక్షన్ సినిమాలే కావడం విశేషం…ఇక ఎన్టీఆర్ మాస్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాడు కావడం వల్ల ప్రశాంత్ నీల్ తన సినిమాను కూడా కొన్ని భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో సినిమాని నింపేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఈ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఈ సినిమాని అమాంతం తారాస్థాయిలో ఎలివేట్ చేసి భారీ సక్సెస్ ని అందించే దిశగా ప్రశాంత్ నీల్ ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా మాత్రం సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఇటు ఎన్టీఆర్, అటు ప్రశాంత్ నీల్ కెరియర్లకు ఈ సినిమా చాలావరకు హెల్ప్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…