Homeఎంటర్టైన్మెంట్Prabhas kindness praised by Bollywood star: ప్రభాస్ మంచితనానికి ఫిదా అయిపోయిన బాలీవుడ్ స్టార్...

Prabhas kindness praised by Bollywood star: ప్రభాస్ మంచితనానికి ఫిదా అయిపోయిన బాలీవుడ్ స్టార్ హీరో..

Prabhas kindness praised by Bollywood star: సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంటాడు. ఒక సక్సెస్ వస్తే చాలు అనుకునే సమయం నుంచి మనమే నెంబర్ వన్ హీరోగా మారాలి అనే రేంజ్ కొంతమంది మాత్రమే వెళ్తారు. అందులో ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి భారీ సక్సెసులను అందించాయి. బాహుబలి లాంటి సినిమాలు అతన్ని పాన్ […]

Prabhas kindness praised by Bollywood star: సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంటాడు. ఒక సక్సెస్ వస్తే చాలు అనుకునే సమయం నుంచి మనమే నెంబర్ వన్ హీరోగా మారాలి అనే రేంజ్ కొంతమంది మాత్రమే వెళ్తారు. అందులో ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి భారీ సక్సెసులను అందించాయి. బాహుబలి లాంటి సినిమాలు అతన్ని పాన్ ఇండియా హీరోగా నిలబెడితే, ఇప్పుడు చేయబోతున్న సినిమాలు ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ కి దగ్గర చేయబోతున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఇంతకుముందు ఆయన వైవిద్యభరితమైన కథాంశాలతో సినిమాలు చేయకపోయిన కూడా కమర్షియల్ గా మాస్ ఎలిమెంట్స్ ని ఉండేలా చూసుకొని తన అభిమానులకు మంచి కిక్ ఇచ్చే సినిమాలైతే చేశాడు… ఇక ప్రస్తుతం ఆయన సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా మీదనే పూర్తి ఫోకస్ పెట్టాడు.

ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో అయిన వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నాడు. ఆయన ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు… రీసెంట్ గా ప్రభాస్ వివేక్ ఒబెరాయ్ మధ్య కొన్ని యాక్షన్స్ సన్నివేశాలను చిత్రీకరించినట్టుగా తెలుస్తుంది.

ఇక ప్రభాస్ వివేక్ ఒబెరాయ్ హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి తన దగ్గరికి రావాలని చెబుతున్నాడట. ప్రభాస్ మంచితనానికి ఫిదా అయిపోయినా వివేక్ రియాల్ హీరో అంటే ప్రభాస్ మాత్రమే అని తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడట. ఆయన సినిమాల్లో యాక్టింగ్ చేయడం విషయం పక్కనపెడితే హ్యుమానిటీ విషయంలో గానీ, ఒక మనిషికి రెస్పెక్ట్ ఇవ్వడంలో గాని ప్రభాస్ తర్వాతే ఎవరైనా అంటూ ఆయన కామెంట్లు చేస్తుండటం విశేషం…

ప్రభాస్ లాంటి మంచి మనసున్న హీరోను నేను బాలీవుడ్ లో చూడలేదు అంటూ ఆయన కామెంట్స్ చేస్తుండటం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ స్టార్ హీరోగా అవతరించిన కూడా తన ఫ్రెండ్స్ దగ్గర గాని రిలేటివ్స్ దగ్గర గాని చాలా హంబుల్ గా ఉంటాడనే విషయాన్ని చాలా మంది సెలబ్రిటీలు పలు సందర్భాల్లో తెలియజేశారు. మరోసారి బాలీవుడ్ హీరో అయిన వివేక్ ఒబెరాయ్ ఈ విషయాన్ని చెబుతూ ఉండడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper