Rajamouli and Mahesh babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి స్టూడెంట్ నెంబర్ వన్ (Student number one) సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి(Rajamoul)… మొదటి సినిమాతోనే సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత చేసిన వరుస సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా ఆయనకున్న క్రేజ్ ను అమాంతం పెంచుతూ వచ్చాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు ఆయన మహేష్ బాబు(Mahesh Babu)తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఎలాగైనా సరే తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక బాహుబలి లాంటి సినిమాలతో పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్న రాజమౌళి ఇప్పుడు చేయబోతున్న సినిమాతో పాన్ వరల్డ్ ప్రేక్షకులను సైతం మెస్మరైజ్ చేయడానికి సిద్దమవుతున్నట్టుగా అర్థమవుతుంది.ఇక ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ అయితే షూట్ జరుగుతుంది. ఇక ఫిబ్రవరి 3వ తేదీతో ఫస్ట్ షెడ్యూల్ షూట్ ముగుస్తుందని సినిమా యూనిట్ నుంచి ఒక సమాచారమైతే అందుతుంది. మరి ఇదిలా ఉంటే ఇప్పుడు కాశీకి సంబంధించిన మణికర్ణిక ఘాట్ ను సెట్ వెయ్యాలనే ఉద్దేశ్యంలో రాజమౌళి ఉన్నారట. ఇక సెకండ్ షెడ్యూల్ ని కాశీ చిత్రికకరించడానికి వాళ్లు సన్నాహాలు చేసినప్పటికి అక్కడ ఎక్కువ రోజుల పాటు పర్మిషన్ అయితే వాళ్లకు దొరకలేదట.
కాబట్టి ఆ లొకేషన్ ను ఇక్కడ సెట్ రూపంలో వేసి వాడుకోవాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నాడట. ఇక ఇప్పటికే అల్యూమినియం ఫ్యాక్టరీ లో సెట్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది…అయితే మణికర్ణిక ఘాటు కి ఒక్క ప్రత్యేకత ఉంది. అది ఏంటి అంటే ఇక్కడ ఎప్పుడు చితి కాలుతూనే ఉంటుంది. ఎక్కువ మంది కాశీలో చనిపోవాలని కోరుకుంటుంటారు. తద్వారా వాళ్లకు పుణ్యం లభిస్తుందని స్వర్గానికి వెళ్తారని కూడా కోరుకుంటారు. అందువల్లే ఈ ఘాట్ వద్ద నిత్యం చాలా మంది చనిపోతూ ఉంటారు. అందువల్లే శవాలు కలుతూనే ఉంటాయి. ఇక ఈ ప్రాసెస్ లోనే ఇక్కడ మహేష్ బాబు యొక్క ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చిత్రీకరించే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నారట.
మరి మొత్తానికైతే రాజమౌళి విపరీతంగా వాడాలనే ప్రయత్నం చేస్తున్న రాజమౌళి తను అనుకున్నది అనుకున్నట్టుగా ఈ సినిమాలో చేయగలుగుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆయన అనుకున్నదిఅనుకున్నట్టుగా సినిమాలో చేస్తే మాత్రం ఈ సినిమా మూడు వేల కోట్లకు పైన కలెక్షన్లను రాబడుతుందనే చెప్పాలి.
ఇక భారీ సినిమాలను తీయడం లో ఇండియాలో ఉన్న దర్శకులలో రాజమౌళి ఒకరు. మరి మొత్తానికైతే పుష్ప 2 సినిమా 200 కోట్లు మార్క్ ను అందుకుంటుంది. కాబట్టి ఈ సందర్భంలో రాజమౌళి భారీ కారత్తులు చేస్తున్న ఈ సినిమా 3000 కోట్లు మార్క్ ను ఈజీగా అందుకుంటుంది అంటూ మరి కొంతమంది వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…