Homeఎంటర్టైన్మెంట్Chandra Mohan: కృష్ణ, విజయ నిర్మల ల పెళ్లి వెనుక చంద్రమోహన్ హస్తం ఉందా?

Chandra Mohan: కృష్ణ, విజయ నిర్మల ల పెళ్లి వెనుక చంద్రమోహన్ హస్తం ఉందా?

రీసెంట్ గా తుది శ్వాస విడిచిన చంద్రమోహన్ వందకు పైగా సినిమాల్లో నటించారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన కళాతపస్వి డైరెక్టర్ కె. విశ్వనాథ్ కి బంధువులు అనే విషయం తెలిసిందే.

Chandra Mohan: ఇండస్ట్రీలో మంచి జోడీగా నిలిచారు విజయ నిర్మల సూపర్ స్టార్ కృష్ణ. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి మాత్రమే కాదు ఆదర్శ జంటగా నిలిచింది ఈ జంట. కృష్ణతో విజయ నిర్మల పలు సినిమాలను డైరెక్ట్ చేసింది. అలా ఏర్పడిన వీరి స్నేహం ప్రేమగా ఆ తర్వాత పెళ్లికి దారి తీసింది. అయినా వీరి పెళ్లి వెనుక చంద్రమోహన్ ఉన్నారని మీకు తెలుసా? అయితే ఈ ఆర్టికల్ చదివేసేయండి..

రీసెంట్ గా తుది శ్వాస విడిచిన చంద్రమోహన్ వందకు పైగా సినిమాల్లో నటించారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన కళాతపస్వి డైరెక్టర్ కె. విశ్వనాథ్ కి బంధువులు అనే విషయం తెలిసిందే. ఇక ఇదే సంవత్సరం వీరిద్దరు చనిపోవడం బాధాకరం. అయితే సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల ఫ్యామిలీతోనూ చంద్రమోహన్ కు మంచి అనుబంధం ఉంది. దీనికి కారణం కూడా ఈ జంట పెళ్లిలో చంద్రమోహన్ హస్తమే అని తెలుస్తోంది. అయితే కృష్ణ, విజయ కలిసిన ఎన్నో సినిమాలు చేశారు.

విజయనిర్మల దర్శకత్వంలో కృష్ణ పలు సినిమాలు చేస్తే.. ఈ ఇద్దరు కలిసి నటించిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. మొత్తం మీద వీరి కెరీర్ లో 40కు పైగా సినిమాలు చేశారు. విజయ నిర్మల డైరెక్ట్ చేసే సినిమాలో ఎక్కువగా కృష్ణనే హీరోగా ఉండేవారు. దీంతో వీరిమధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అది ప్రేమగా ఏర్పడి ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా మారిందట. దీంతో పెళ్లి చేసుకోవాలని కూడా నిశ్చయించుకున్నారు. అయితే అప్పటికే ఇందిరాతో కృష్ణకు పెళ్లి జరిగింది. పిల్లలు కూడా ఉన్నారు. అంతే కాదు విజయ నిర్మలకు కూడా పెళ్లి అయింది. ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయినా కూడా వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట.

ఇలాంటి సమయంలోనే వీరిద్దరికి అండగా నిలిచాడు చంద్రమోహన్. ఇద్దరికి ధైర్యం చెప్పి దగ్గరుండి పెళ్లి చేశారట. తిరుపతిలో కృష్ణ, విజయ నిర్మల పెళ్లిచేసుకోగా ఆ పెళ్లి ఏర్పాట్లు మొత్తం చూసుకుంది చంద్రమోహన్ అని టాక్. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కృష్ణ మేకప్ మెన్, విజయ అసిస్టెంట్, చంద్రమోహన్, మోహన్ కుమార్ అనే మరో జర్నలిస్ట్ లు కలిసి వీరికి తిరుపతిలో పెళ్లి చేశారు. ఈ పెళ్లితోనే చంద్రమోహన్ వీరి ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోయారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper