Telangana BJP
BJP Manifesto: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది సభలు, సమావేశాలతోపాటు సోషల్ మీడియాలోనూ అన్ని పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. బీఆర్‌ఎస్ రేసులో ముంద ఉండగా, కాంగ్రెస్, బీజేపీలు కాస్త వెనుకపడ్డాయి. అభ్యర్థుల ప్రకటన నుంచి మేనిఫెష్టో విడుదల, ప్రచారంలో ఇలా అన్నింటిలో బీఆర్‌ఎస్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇక అభ్యర్థుల ప్రకటకే కాంగ్రెస్, బీజేపీ అష్టకష్టాలు పడ్డాయి. నామినేషన్లు ముగియడంతో ప్రచారం, మేనిఫెస్టోపై దృష్టిపెట్టాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఆరు గ్యాంరంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లింది. మేనిఫెస్టో రిలీజ్‌కు కసరత్తు చేస్తోంది. మరోవైపు బీజేపీ కూడా మేనిఫెస్టో ఫైనల్ చేసింది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ పార్టీ మారడంతో ఆయన ఆధ్వర్యంలో రూపొందించిన మేనిఫెస్టోలో మార్పులు చేసి తుది రూపు ఇచ్చింది కమలం పార్టీ. ఈనెల 17న హోం మంత్రి అమిత్‌షా చేతులు మీదుగా విడుదల చేయాలని నిర్ణయించింది.
నాలుగు రాష్ట్రాల్లో ఒకేలా..
ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ మేనిఫెస్టోలను అమిత్‌షా విడుదల చేశారు. తాజాగా తెలంగాణ మేనిఫెస్టో రిలీజ్‌కు కూడా ఆయనే వస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈసారి బీజేపీ బీసీ నినాదం ఎత్తుకుంది. ఎస్సీ వర్గీకరణ హామీ ద్వారా.. వారి మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో మేనిఫెస్టో కూడా ఇలాంటి అంశాలను ఫోకస్ చేస్తూ ఉండబోతోందని తెలుస్తోంది. ప్రధాని మోదీ గ్యారెంటీ పేరుతో మేనిఫెస్టో తేబోతోందని అంటున్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు భిన్నంగా..
బీజేపీ మేనిఫెస్టో కచ్చితంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు కొంత భిన్నంగానే ఉండబోతోంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ.10 లక్షల వరకూ ఉచిత వైద్యం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అర్హులైన పేదలకు ఇల్లు, పెళ్లయిన ప్రతీ మహిళకూ సంవత్సరానికి రూ.12వేలు, రూ.500కే గ్యాస్ సిలిండర్, తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, జన ఔషధి కేంద్రాల ఏర్పాటు, రైతులకూ, మహిళా సంఘాలకూ వడ్డీ లేని రుణాలు, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ.20 వేలు, ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ వంటి హామీలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
17న అమిత్ షా రాక..
ఈనెల 17న అమిత్ షా తెలంగాణకు రానున్నారు. వరంగల్, నల్గొండ, గద్వాల, రాజేంద్రనగర్. నాలుగు బహిరంగ సభల్లో మాట్లాడతారు. అప్పుడే మేనిఫెస్టో ప్రకటిస్తారని అంటున్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొన్న నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టో ఎలా ఉంటుంది. వారి ఓట్లకు గండికొట్టే హామీలు ఏమి ఇస్తుంది అన్న చర్చ జరుగుతోంది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Bjp manifesto is ready what are the key points in it
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com