టెలివిజన్ రంగం నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన నటి పాయల్ రాజ్‌పుత్. తెలుగులో తన తొలి చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ లో అందలు ఆరబోసి యూత్ హార్ట్ బీట్ పెంచింది. దాంతో పాటు నెగెటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ క్యారెక్టర్లో అద్భుతంగా నటించింది. అందం, అభినయం రెండూ ఉన్నా మొదటి సినిమాతోనే ఆమెపై బోల్డ్ హీరోయిన్ అనే ముద్ర పడింది. మళ్లీ అలాంటి పాత్రలే ఆమె ముందుకొచ్చాయి. కెరీర్ ఆరంభంలో ఉండడంతో వాటిని కాదనలేకపోయిందామె. ‘ఆర్డీఎక్స్ లవ్’ అనే చిన్న సినిమాలో మరింత బోల్డ్‌గా కనిపించింది. పాయల్‌తోనే ఆ సినిమాకు గుర్తింపు వచ్చింది. కానీ, కంటెంట్ లేకపోవడంతో ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ చిత్రాల్లో కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసి టాలీవుడ్లో నిలదొక్కుకుంది ఈ ఢిల్లీ భామ. ముఖ్యంగా రవితేజ సరసన డిస్కో రాజాలో బధిర యువతిగా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: I want to act with prabhas pawan and mahesh payal
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com