Star Heroine: సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత హీరోయిన్ గా అవకాశాలను అందుకోవడం ఒక ఎత్తు అయితే ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకొని స్టార్ హీరోయిన్గా ఎదగడం మరొక ఎత్తు. చాలామంది ముద్దుగుమ్మలు ఎన్నో అవకాశాలు అందుకున్నప్పటికీ అనుకున్నంత గుర్తింపును మాత్రం తెచ్చుకోలేకపోతున్నారు. అలాగే మరికొంతమంది ముద్దుగుమ్మలు చాలా తక్కువ సినిమాలు చేసినా కూడా హిట్స్ అందుకొని స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొంతమంది ముద్దుగుమ్మలు ఓవర్ నైట్ లో స్టార్స్ గా కూడా మారిపోయారు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా సక్సెస్ సాధించడం అంత సులభమైన పని కాదు అన్న సంగతి అందరికీ తెలిసిందే. కొంతమంది మాత్రం అదృష్టం కలిసి వచ్చి ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు. మరి కొంతమంది మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఇప్పటివరకు స్టార్డం అందుకోలేకపోతున్నారు. ఇంకొంతమంది ముద్దుగుమ్మలు తొలి సినిమాతో విజయం అందుకున్నప్పటికీ అదృష్టం కలిసి రాక తర్వాత చేసిన సినిమాలతో ఫ్లాప్స్ అందుకుంటున్నారు. ఇటువంటి హీరోయిన్లలో ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ హిట్ ఫ్లాప్ లకు సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను అలరించింది. కానీ ఇప్పటివరకు ఈమెకు సరైన క్రేజ్ మాత్రం రావడం లేదు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఇప్పటివరకు స్టార్ స్టేటస్ అందుకోలేక పోతుంది.
Also Read: పోక్సో కేసు పెట్టాలి… కీరవాణి పై సీనియర్ డైరెక్టర్ సంచలన కామెంట్స్
కెరియర్ ప్రారంభంలో ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. కానీ ఈమె నటించిన సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ కావడంతో క్రమంగా ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఈ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం ఉండదు. తెలుగులో పాయల్ ఇప్పటివరకు 12 సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఆ 12 సినిమాలలో రెండు సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించాయి. ఎం హీరో కార్తికేయ కు జోడిగా పాయల్ ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. తొలి సినిమాతోనే కుర్రాళ్ళ మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా భారీ వసూళ్లను కూడా రాబట్టింది. మొదటి సినిమాలోని ఓ రేంజ్ లో రొమాంటిక్ సన్నివేశాలలో నటించి బాగా ఫేమస్ అయ్యింది పాయల్ రాజ్ పూత్. ఈమె నటించిన మొదటి సినిమా హిట్ అయినా కూడా ఈమెకు అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. తెలుగులో పాయల్ ఎన్టీఆర్ కథానాయకుడు, ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, తీస్మార్ ఖాన్, మాయ పేటిక, మంగళవారం వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈ సినిమాలలో మంగళవారం సినిమా ఒక్కటే బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.
View this post on Instagram