Payal Rajput : సీరియల్ నటి పాయల్ రాజ్ పుత్ అనంతరం సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. దర్శకుడు అజయ్ భూపతి ఆమెను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆర్ఎక్స్ 100 మూవీలో హీరోయిన్ గా ఎంపిక చేశాడు. కార్తికేయ హీరోగా నటించిన ఆర్ఎక్స్ 100 విలేజ్ ట్రాజిక్ లవ్ డ్రామాగా తెరకెక్కింది. ఆర్ఎక్స్ 100 బ్లాక్ బస్టర్ కొట్టింది. ప్రేమ కథను వినూత్నంగా చెప్పడంలో అజయ్ భూపతి సక్సెస్ అయ్యాడు. మితిమీరిన శృంగార సన్నివేశాల్లో పాయల్ రాజ్ పుత్ నటించింది. అలాగే ఆమెది నెగిటివ్ షేడ్స్ తో కూడిన పాత్ర. ఆర్ఎక్స్ 100 యువతను ఊపేసింది. దాంతో పాయల్ ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.
Also Read : పాయల్ అందాల అరాచకం.. పోస్ట్ పెడితే పూనకాలే..
ఎన్టీఆర్ కథానాయకుడు మూవీలో గెస్ట్ రోల్ చేసింది. డిస్కో రాజా మూవీలో హీరో రవితేజతో మూవీ చేసే ఛాన్స్ పాయల్ కి దక్కింది. డిస్కో రాజా హిట్ కొడితే బ్రేక్ వస్తుందని పాయల్ భావించింది. కానీ ఆ మూవీ నిరాశపరిచింది. డిస్కో రాజాలో పాయల్ మూగ అమ్మాయి పాత్ర చేయడం విశేషం. పాయల్ సక్సెస్ రేటు చాలా తక్కువ. అందుకే స్టార్ హీరోయిన్ హోదా దక్కలేదు. ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి మంగళవారం రూపంలో మరో హిట్ ఇచ్చాడు.
పాయల్ రాజ్ పుత్ శృంగార సంబంధించిన రుగ్మతతో బాధపడే అమ్మాయి పాత్ర చేసింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సస్పెన్సు క్రైమ్ డ్రామా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మరోసారి పాయల్ హాట్ సన్నివేశాల్లో నటించిన వార్తలకు ఎక్కింది. హిట్ పడినా పాయల్ కి చెప్పుకోదగ్గ ఆఫర్స్ రావడం లేదు. రక్షణ టైటిల్ తో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. పాయల్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. అందుకే ఆమె పెళ్లి పీటలు ఎక్కాలని భావిస్తుందట.
పాయల్ రాజ్ పుత్ వివాహం అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. సాంప్రదాయ పెళ్లి వస్త్రాల్లో ఉన్న పాయల్ ఫోటోలు బయటకు వచ్చాయి. తన ప్రియుడు సౌరబ్ దింగ్రా ను పాయల్ వివాహం చేసుకుంటుందట. సౌరబ్-పాయల్ ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సౌరబ్ నటుడు, మ్యూజిక్ కంపోజర్, నిర్మాత కూడాను. వీరిద్దరి రిలేషన్ బహిరంగ రహస్యమే. ఫైనల్లీ వివాహం చేసుకుని ఏడు అడుగులు వేయనున్నారు. పాయల్ పెళ్లి పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read : పాయల్ పరువాలు.. ఇదేందమ్మ ఇది మరీ ఈ రేంజ్ లో ఆకట్టుకుంటారా?