Payal Rajput : మన టాలీవుడ్ లో అందం, నటన రెండు ఉన్న హీరోయిన్లు దొరకడం చాలా అరుదు. కానీ ఆ రెండు ఉన్నప్పటికీ అదృష్టం కలిసిరాక పెద్ద రేంజ్ కి వెళ్లని హీరోయిన్స్ కొంతమంది ఉన్నారు. వారిలో ఒకరు పాయల్ రాజ్ పుత్(Payal Rajput). బాలీవుడ్ లో సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించిన ఈ అమ్మాయి, తెలుగు లో RX100 చిత్రం ద్వారా మన ఆడియన్స్ కి పరిచయమైంది. ఈ సినిమాలో విలన్ గా ఆమె నటన ఏ రేంజ్ లో ఆడియన్స్ ని అలరించిందో మనమంతా చూసాము. అయితే మొదటి సినిమాలోనే అంతటి విలన్ క్యారక్టర్ చేయడం వల్లో ఏమో తెలియదు కానీ, ఆమె పై ఆ సినిమా ప్రభావం చాలా బలంగా పడింది. ఆందుకే అవకాశాలు ఆశించిన స్థాయిలో రావడం లేదని పలువురి అభిప్రాయం. అయితే రీసెంట్ గానే ఆమె ట్విట్టర్ లో వేసిన కొన్ని ట్వీట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
Also Read : భూవివాదంపై రేణు దేశాయ్ ఆవేదన..సంచలనం రేపుతున్న వాట్సాప్ చాట్!
ఆమె మాట్లాడుతూ ‘సినీ ప్రపంచం లో నటుడిగా/ నటిగా కొనసాగడం అనేది అత్యంత కఠినమైన పరిస్థితులలో ఒకరి. ప్రతీ రోజు ఎదో తెలియని భయం తో మన రోజు మొదలవుతుంది. ఇండస్ట్రీ లో నెపోటిజం రాజ్యం ఏలుతుంది. నిజమైన టాలెంట్ ఈ నెపోటిజం ముసుగులో కనుమరుగు అయిపోతుంది. నేను పడే కష్టానికి తగ్గ ఫలితం, నా టాలెంట్ కి తగ్గ అవకాశాలు భవిష్యత్తులో అయినా వస్తాయా లేదా అని ఆలోచించినప్పుడు రావేమో అని భయం వేస్తుంది. ఎందుకంటే పెద్ద సినీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళ కారణంగా అవకాశాలు నా చెయ్యి నుండి జారిపోవడం వంటివి చాలాసార్లు చూసాను. ఇలాంటివి తల్చుకున్నప్పుడు మనసుకి చాలా బాధగా ఉంటుంది’ అంటూ పాయల్ రాజ్ పుత్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఆమె వ్యాఖ్యలకు సపోర్టుగా నెటిజెన్స్ కూడా నిలిచారు. RX100 చిత్రంలో మీ నటన, అందాన్ని చూసి టాలీవుడ్ లో భవిష్యత్తులో పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోతావని అనుకున్నామని, కానీ కనీసం మీడియం రేంజ్ హీరోయిన్ గా కూడా స్థిరపడనందుకు చింతిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రీసెంట్ గా ఇండస్ట్రీ ట్రెండింగ్ లో ఉన్నటువంటి కుర్ర హీరోయిన్స్ కి కనీసం ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం కూడా రావడం లేదు. అలాంటోళ్ళు నేడు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్స్ ని అందుకుంటూ వేరే స్థాయిలో ఉంటున్నారు. కానీ మీరు మాత్రం ఇంకా ఇక్కడే ఉండిపోయారు, కచ్చితంగా మీకు జరుగుతున్నది అన్యాయమే, భవిష్యత్తులో అయినా మీ పెద్ద రేంజ్ కి వెళ్లాలని ఆశిస్తున్నాము అంటూ పాయల్ రాజ్ పుత్ కి ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసారు. ఆమె చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం ‘మంగళవారం’. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆమె మరో సినిమాలో నటించడానికి సంతకం చేయలేదు.
Also Read : 2 నిమిషాల్లో హౌస్ ఫుల్..రీ రిలీజ్ లో ‘ఆర్య 2’ సెన్సేషనల్ రికార్డు!