Homeఎంటర్టైన్మెంట్Biker Movie: రాజశేఖర్ తో కలిసి నటించడం ఇష్టం లేక 'బైకర్' చిత్రాన్ని వదులుకున్న యంగ్...

Biker Movie: రాజశేఖర్ తో కలిసి నటించడం ఇష్టం లేక ‘బైకర్’ చిత్రాన్ని వదులుకున్న యంగ్ హీరో అతనేనా..

Biker Movie: ఒక హీరో చెయ్యాల్సిన సినిమాని మరో హీరో చేయడం వంటివి మన టాలీవుడ్ లో కొత్తేమి కాదు , దశాబ్దాల నుండి జరుగుతూనే వస్తుంది. రీసెంట్ గా విడుదలైన ‘బైకర్’ చిత్రం కూడా అలాంటిదే అట. ఇటీవలే సమ్మర్ కానుకగా విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే ఆడియన్స్ లో మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. చాలా కాలం తర్వాత ఒక మంచి ఎమోషనల్ మూవీ ని చూశాము అనే ఫీలింగ్ కలిగిందని […]

Biker Movie: ఒక హీరో చెయ్యాల్సిన సినిమాని మరో హీరో చేయడం వంటివి మన టాలీవుడ్ లో కొత్తేమి కాదు , దశాబ్దాల నుండి జరుగుతూనే వస్తుంది. రీసెంట్ గా విడుదలైన ‘బైకర్’ చిత్రం కూడా అలాంటిదే అట. ఇటీవలే సమ్మర్ కానుకగా విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే ఆడియన్స్ లో మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. చాలా కాలం తర్వాత ఒక మంచి ఎమోషనల్ మూవీ ని చూశాము అనే ఫీలింగ్ కలిగిందని , కచ్చితంగా ఈ చిత్రం శర్వానంద్ కెరీర్ లో ఒక మర్చిపోలేని తీపి జ్ఞాపకం లాగా మిగిలిపోతుందని ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రాన్ని శర్వానంద్ కంటే ముందు ఒక హీరో చేయాల్సి ఉందట. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ కథ ఆ హీరో తో ఎప్పుడో లాక్ అయ్యిందట.

ఆ హీరో మరెవరో కాదు , వరుణ్ తేజ్. ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తే , ఇలాంటి సినిమాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. ముందుగా ఈ చిత్రాన్ని చేయడానికి అప్పట్లో ఆయన చాలా ఉత్సాహం చూపేవాడని , కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ, ఈ ప్రాజెక్ట్ నుండి ఆయన తప్పుకున్నాడు అంటూ సోషల్ మీడియా లో ఒక ప్రచారం జరుగుతుంది. కారణం , ఈ చిత్రం లో హీరో పాత్ర కోసం రాజశేఖర్ ని ఎంచుకున్నాడు అనే విషయం వరుణ్ తేజ్ కి ముందుగా చెప్పకపోవడమే అని అంటున్నారు. రాజశేఖర్ తో మెగా ఫ్యామిలీ కి ఎప్పటి నుండో గొడవలు ఉన్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ కి తన ఇద్దరు బాబాయిలు చిరంజీవి , పవన్ కళ్యాణ్ లపై ఎవరైనా కామెంట్స్ చేస్తే అసలు ఇష్టం ఉండదు. అందుకే రాజశేఖర్ అంటే కూడా ఆయనకు ఇష్టం ఉండేది కాదని , ఆయనతో కలిసి నటించడానికి అందుకే ఇష్టం చూపలేదని కొంతమంది అంటున్నారు.

మరికొంతమంది అయితే సినిమాలో హీరో అయినప్పటికీ కూడా నటీనటులను ఎంచుకున్నప్పుడు , కనీసం హీరో కి సమాచారం ఇవ్వడం అనేది ఆనవాయితీ, అలా ఏ మాత్రం ప్రోటోకాల్ లేకుండా, తనకు గౌరవం ఇవ్వకపోవడం వల్లే ఈ ప్రాజెక్ట్ మిస్ అయ్యిందని అంటున్నారు. వీటిల్లో ఏది నిజమో తెలియదు కానీ , ‘బైకర్’ మూవీ ని మిస్ చేసుకోవడం మాత్రం చాలా కాస్ట్లీ లాస్ అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇకపోతే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ రన్ ని సొంతం చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. కానీ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కచ్చితంగా ఈ చిత్రం వచ్చే వారం డీసెంట్ హోల్డ్ ని కనబర్చాలి. కానీ వచ్చే వారం ‘డెకాయిట్’, ‘LIK ‘ వంటి చిత్రాలు విడుదల అవ్వబోతున్నాయి. ఈ రెండు సినిమాలను తట్టుకొని ‘బైకర్’ ఎలా ఆడుతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper