Prabhas remuneration for Hanu Raghavapudi movie
Prabhas: ప్రస్తుతం పాన్ ఇండియాలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఏకైక హీరో ప్రభాస్… ఆయన చేసిన 5 సినిమాలు 300 కోట్లకు పైన వసూళ్లను రాబట్టాయి. ఇకా గతేడాది రిలీజ్ అయిన సలార్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా దాదాపు 900 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఇక ఈ సినిమాని రీసెంట్ గా అఫిషియల్ గా కూడా అనౌన్స్ చేశారు. కాబట్టి ఈ సినిమా కోసం దాదాపు ఆయన 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాతో తను మరోసారి స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఇక ఇది ఇలా ఉంటే 200 కోట్ల వరకు రెమ్యూన రేషన్ తీసుకుంటున్న హీరో ప్రస్తుతం ప్రభాస్ ఒక్కడే కావడం విశేషం. ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్ రాజాసాబ్, కల్కి లాంటి సినిమాలను చేస్తున్నాడు. ఈ సినిమాలతో కూడా ఆయన ఆశించిన మేరకు మంచి విజయాలను సాధించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేయబోతున్నాడు.
ఇక ఈ సినిమా కూడా ఆల్మోస్ట్ సూపర్ సక్సెస్ సాధించి సినిమా సూపర్ హిట్ అవుతుందని ఇప్పటికే ప్రేక్షకులందరు మంచి అంచనాలు పెట్టుకున్నారు. కాబట్టి ప్రభాస్ వరుసగా చాలా మంచి సినిమాలు చేస్తున్నాడనే చెప్పాలి. ఇక ఒక్క సినిమా కోసం 200 కోట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఆయనతో సినిమా చేస్తే ప్రొడ్యూసర్స్ కి ఎంత ప్రాఫిట్స్ వస్తాయో మనం అర్థం చేసుకోవచ్చు…