Megastar Mania: ప్రస్తుతం పాన్ ఇండియాలో తెలుగు సినిమాల హవా కొనసాగుతుంది. ఇక ఇప్పుడు కూడా పుష్ప 2 సినిమా మీద ప్రతి ఒక్కరి లో భారీ అంచనాలైతే ఉన్నాయి. ఎందుకంటే పుష్ప మొదటి పార్ట్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంత ఇంత కాదు దానివల్ల సెకండ్ పార్ట్ మీద కూడా మంచి అంచనాలైతే ఏర్పడ్డాయి. ఇక రీసెంట్ గా వచ్చిన ఈ సినిమా టీజర్ ని చూస్తుంటే ఈ సినిమా ఒక ప్రభంజనాన్ని సృష్టించబోతుందనే విషయం అయితే చాలా స్పష్టంగా అర్థం అవుతుంది.
ఇక ఇప్పటికే ప్రభాస్ కల్కి, రామ్ చరణ్ గేమ్ చేంజర్ లాంటి సినిమాలు ఈ సంవత్సరంలో రిలీజ్ అవుతున్నప్పటికీ పుష్ప 2 సినిమా మీద ఉన్న బజ్ అయితే మిగతా సినిమాల మీద లేదు. ఇక దీనికి కారణం అల్లు అర్జున్ అని చాలామంది అంటున్నారు. ఇక పుష్ప 2 నైజాం థియేట్రికల్ రైట్స్ కోసం ఏకంగా 100 కోట్లు ఇవ్వడానికి చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు పుష్ప మేనియా ఏ రేంజ్ లో ఉందో.. ఇక ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ కోసం కూడా విపరీతమైన పోటి అయితే ఉంది. మరి ఇలాంటి క్రమంలో పుష్ప 2 సినిమా ఎలాంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో అయిపోయాడు. ఆయన ఏం చేసినా మహా అయితే ఇంకో నాలుగు ఐదు సినిమాల కంటే ఎక్కువగా చేయలేడు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే పవన్ కళ్యాణ్ ఎక్కువగా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. కాబట్టి ఆయన సినిమాల విషయంలో పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాడు. ఇక మిగిలింది రామ్ చరణ్, అల్లు అర్జున్ వీరిద్దరిలో మెగాస్టార్ చిరంజీవి మేనియా ను ముందుకు తీసుకెళ్లే స్టార్ డమ్ ఎవరికి ఉంది అనే ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ఇక అందులో చాలా మంది అల్లు అర్జున్ పేరు మాత్రమే చెబుతున్నారు.
ఎందుకంటే మెగాస్టార్ కొడుకుగా ఇండస్ట్రీ కి వచ్చిన రామ్ చరణ్ స్టార్ హీరోగా ఎదిగినప్పటికీ, అల్లు అరవింద్ కొడుకు గా ఇండస్ట్రీకి వచ్చిన అల్లు అర్జున్ మాత్రం పాన్ ఇండియాలో నేషనల్ అవార్డు గెలుచుకునే అంత స్థాయికి వెళ్ళాడు అంటే అక్కడే రామ్ చరణ్ కంటే అల్లు అర్జున్ ముందున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఇప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తాన్ని తను ముందు ఉండి నడిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ పుష్ప 2 సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే ఇక మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ ని మించిన హీరో మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…