Pragya Jaiswal: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా అఖండ. ప్రగ్యా జైస్వాల్ ఇందులో హీరోయిన్గా నటిస్తుండగా.. జగపతిబాబు, శ్రీకాంత్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ద్వరకా క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. డిసెంబరు 2న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అఖండ ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ మీడియాతో ముచ్చటించారు.. ఆ విశేషాలేంటో చూద్దాం రండి.
తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ.. నటిగా మారాని అనుకున్నప్పుడే మంచి పాత్రలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వచ్చిన కథల్లో మంచి పాత్రలను మాత్రమే ఎంచుకుంటానని. అందులో కొన్ని సక్సెస్ అయినా.. మరికొన్ని ప్రయోగాత్మకంగా మిగిలిపోతయని అన్నారు.
Also Read: Kamal Haasan: కమల్‌హాసన్ విషయంలో శ్రుతి కీలక నిర్ణయం
మరోవైపు, బాలకృష్ణ గురించి స్పందిస్తూ.. ఎంతకాదనుకున్నా.. బాలయ్య సీనియర్. అంతపెద్ద హీరోతో ఇప్పటి వరకు కలిసి నటించలేదు. ఇక ఆయన గురించి చెప్పాలంటే.. టైం అంటే టైం. మొదట ఆయనతో కలిసి పనిచేయడానికి ఎంతో నెర్వస్‌గా ఫీల్ అయ్యా.. కానీ, కలిసిన ఐదు నిమిషాల్లోనే చాలా కలిసిపోయారు. ఆయనలాంటి పాజిటివ్ పర్సన్‌ను ఇప్పటి వరకు నేను చూడలేదు. ఇక ఆయన సెట్స్‌లో అడుగుపెడితే చాలు.. అంతా నిశ్శబ్దమే. క్రమశిక్షణ, సమయపాలనలో ఆయనే తోపు. అని తెలిపింది పగ్యా.
మరోవైపు సెట్స్‌లో జగపతిబాబును చూసి మొదటిరోజు అసలు గుర్తుపట్టలేదని తెలిపింది. బోయపాటి ఆయన్ను అంతలా మార్చేశారని.. జగ్గూబాయ్ గెటప్ సినిమాలో చాలా కొత్తగా ఉంటుందని అన్నారు. మరి ఇన్ని అంచనాలతో వస్తున్న అఖండ ఏ మేరకు విజయం సాధిస్తుందో తెలియాల్సి ఉంది.
Also Read: Akhanda Movie: అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా దర్శక ధీరుడు రాజమౌళి…
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More