Cheating Bride: సాధారణంగా ఫారిన్ కుర్రాళ్లు మోసం చేస్తే ఆడపిల్లల తల్లిదండ్రులు లబోదిబోమని మొత్తుకుంటారు. ఫారిన్ కుర్రాడిని పెళ్లి చేసుకొని వధువులు అష్టకష్టాలు పడుతుంటారు. కానీ ఇక్కడ ట్రెయిన్ రివర్స్ అయ్యింది. చూడడానికి అందం, చందంగా ఉన్నదని ఒక అమ్మాయిని చూసి మనసుపడిన ఫారిన్ నుంచి వచ్చిన కుర్రాడు.. ఆమెకు సర్వం సమర్పించాడు. వేసుకోవడానికి బంగారు నగలు.. తిరగడానికి స్కూటీ కొనిచ్చాడు.. ఇక చేతి ఖర్చులకు రూ.50వేలు ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చి నిశ్చితార్థం చేసుకున్న యువతి చివరకు ఈ ఫారిన్ కుర్రాడికి దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది.

తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలోని తరగంబాడి తాలుకా కలియూరు ప్రాంతంలో చిన్నతంబి(28) అనే యువకుడు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నతంబి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న చిన్నతంబి పెళ్లి చేసుకోవాలని ఆశపడి సెలవుల మీద సొంత ఊరు వచ్చాడు. పెళ్లి చేసుకోవాలని చిన్నతంబి మంచి అమ్మాయి కోసం వెతికాడు. బంధువులు చిన్నతంబికి విల్లియనల్లూరులోని పెద్ద వీధిలో నివాసం ఉంటున్న అభినయ(19) అనే అమ్మాయిని సెట్ చేశారు. అభినయ చూడడానికి అందంగా ఉండడంతో చిన్నతంబి కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నిశ్చితార్థానికి బంగారు నగలు, డబ్బు, అమ్మయికి ఒక స్కూటిని వరుడు కొనిచ్చాడు. నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఆ తర్వాత పెళ్లి కూతురు ట్విస్ట్ ఇచ్చింది.
నిశ్చితార్థానికి ముందు గంటలు గంటలు మాట్లాడుకున్న ఇద్దరు ఎంగేజ్ మెంట్ అయ్యాక పరిస్థితి మారింది. అభినయ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుంది. కాబోయే భార్య కోసం ఆరాతీస్తే ఇంట్లో లేదని తెలిసింది. అడిగితే కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు చెప్పారు.దీంతో అభినయ తమ్ముడిని పట్టుకొని అతడితో ఫోన్ చేయిస్తే లిఫ్ట్ చేసింది. ఫోన్ అందుకున్న చిన్నతంబి నిలదీశాడు.. ‘జరిగిందేదో జరిగిపోయింది..నాకు పెళ్లి అయ్యింది..నన్ను మరిచిపోయి వేరే వివాహం చేసుకో’ అని అభినయ ఫోన్ పెట్టేసింది.

Also Read: Health: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ!
దీంతో లబోదిబోమన్న పెళ్లికొడుకు తను కొనిచ్చిన బంగారు నగలు, డబ్బు, స్కూటీని తిరిగి ఇచ్చేయాలని అభినయ కుటుంబ సభ్యులను కోరాడు. వాళ్లు పట్టించుకోకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మోసం చేసి పారిపోయిన అభినయ కోసం గాలిస్తున్నారు. చిన్నతంబికి సంబంధం చూసిన పెద్దలు ఇదేంట్రా బాబూ అని తలపట్టుకున్నారు.
Also Read: అయ్యో.. ఆ ప్రముఖ సింగర్ కుటుంబంలో దారుణం !