Homeఎంటర్టైన్మెంట్The Paradise Movie: 'ది ప్యారడైజ్' మూవీ మొట్టమొదటి రివ్యూ.. సెకండ్ హాఫ్ పై ఊహించని...

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ మూవీ మొట్టమొదటి రివ్యూ.. సెకండ్ హాఫ్ పై ఊహించని టాక్!

The Paradise Movie: నేచురల్ స్టార్ నాని హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక స్టార్ హీరో పాన్ ఇండియన్ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో , ఈ చిత్రానికి కూడా అదే రేంజ్ క్రేజ్ ఉంది. ఓవర్సీస్ లో రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టారు. నార్త్ […]

The Paradise Movie: నేచురల్ స్టార్ నాని హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక స్టార్ హీరో పాన్ ఇండియన్ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో , ఈ చిత్రానికి కూడా అదే రేంజ్ క్రేజ్ ఉంది. ఓవర్సీస్ లో రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టారు. నార్త్ అమెరికా లో , సినిమా విడుదలకు 10 రోజుల ముందే 3 లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి అట. ఈమధ్య కాలం లో చాలా మంది స్టార్ హీరోలకు కూడా ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు. అలాంటిది ఈ సినిమాకు జరిగిందంటే క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి కాపీ రెడీ అయిపోయింది. చిన్న చిన్న రీ రికార్డింగ్ పనులు మాత్రమే మిగులున్నాయి. రీసెంట్ గా ఈ సినిమాని నాని ప్రసాద్ ల్యాబ్స్ లో కొంత డిస్ట్రిబ్యూటర్స్ తో కలిసి చూశారట. వాళ్ళ నుండి వచ్చిన రెస్పాన్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ వరకు ఈ సినిమా వేరే లెవెల్ లో ఉంటుందట. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు , నాని మాస్ యాటిట్యూడ్, ఎలివేషన్ సీన్స్ అన్ని కూడా అదిరిపోయాయట. హీరోయిజం ని సరికొత్తగా ప్రెజెంట్ చేయడం లో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఫస్ట్ హాఫ్ వరకు సక్సెస్ అయ్యాడట. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఆ స్థాయిలో లేదని అంటున్నారు. చాలా సన్నివేశాలు హడావిడిగా చుట్టేసినట్టు ఉంటుందట. ఇక హీరోయిన్ కాయదు లోహర్ పాత్ర అయితే మింగుడు పడని రేంజ్ లో ఉందట. దీన్ని ఆడియన్స్ ఎలా రీసీవ్ చేసుకుంటారో అర్థం కావడం లేదని అంటున్నారట.

ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ ఫస్ట్ హాఫ్ , యావరేజ్ సెకండ్ హాఫ్ అంటున్నారు. మరి ఆడియన్స్ నుండి కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి. కానీ నాని మాత్రం ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశాడట. ఎక్కడా కూడా అసలు తగ్గలేదట, ఆయన నుండి ఈ రేంజ్ మాస్ పెర్ఫార్మన్స్ ని కలలో కూడా ఊహించలేదని అంటున్నారు. ఇక అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ అంచనాలను మించి ఉన్నట్టు టాక్. మోహన్ బాబు పాత్ర కూడా ఈ సినిమాకు పెద్ద హైలైట్ గా నిలుస్తుందట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper