Homeఎంటర్టైన్మెంట్Star Hero: ఛాన్స్ లు రాక కూలీ పనులు చేసిన స్టార్...

Star Hero: ఛాన్స్ లు రాక కూలీ పనులు చేసిన స్టార్ హీరో

Star Hero: పాతికేళ్ల క్రితం, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో.. యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఏకైక హీరో అబ్బాస్. ముఖ్యంగా ‘ప్రేమదేశం’ సినిమా తర్వాత అబ్బాస్ రేంజ్ రెట్టింపు అయ్యింది. ప్రేమికుడిగా.. ప్రియురాలి ప్రేమ కోసం పరితపించే పాత్రలో అబ్బాస్ నటన అద్భుతం అనిపించింది. మెయిన్ గా అబ్బాస్ లుక్ అదుర్స్ అనిపించింది. అప్పట్లో యువతుల గుండెల్లో ఈ హ్యాండ్సమ్ హీరో గుబులు రేపాడు. కానీ, ఆ తర్వాత చాలా వేగంగా కనుమరుగైపోయాడు […]

Star Hero: పాతికేళ్ల క్రితం, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో.. యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఏకైక హీరో అబ్బాస్. ముఖ్యంగా ‘ప్రేమదేశం’ సినిమా తర్వాత అబ్బాస్ రేంజ్ రెట్టింపు అయ్యింది. ప్రేమికుడిగా.. ప్రియురాలి ప్రేమ కోసం పరితపించే పాత్రలో అబ్బాస్ నటన అద్భుతం అనిపించింది. మెయిన్ గా అబ్బాస్ లుక్ అదుర్స్ అనిపించింది. అప్పట్లో యువతుల గుండెల్లో ఈ హ్యాండ్సమ్ హీరో గుబులు రేపాడు. కానీ, ఆ తర్వాత చాలా వేగంగా కనుమరుగైపోయాడు అబ్బాస్.

Hero Abbas
Hero Abbas

‘ప్రేమ దేశం’ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అంత పాతాళానికి పడిపోయాడు. తొలి సినిమాతోనే సంచలనం విజయం అందుకున్న అబ్బాస్ కెరీర్ ఎందుకు పతనం అయింది ? అన్నిటికీ మించి స్టార్ హీరో అయ్యాక, అబ్బాస్ పెట్రోల్ బంక్ లో ఎందుకు పని చేయాల్సి వచ్చింది ? లేడీస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చాక.. డ్రీం బాయ్ గా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాక, అబ్బాస్ తన కెరీర్ ను ఎలా కోల్పోయాడు ? ఇలాంటి అనేక ప్రశ్నలు అబ్బాస్ జీవితం వైపు తొంగిచూసేలా చేశాయి.

Also Read:  ఆర్ఆర్ఆర్ టీమ్ మెంబ‌ర్స్ కు సోష‌ల్ మీడియాలో ఉన్న ఫాలోవ‌ర్ల సంఖ్య తెలుసా..?

నిజానికి అప్పట్లో తెలుగులో లెక్కలేనన్ని సినిమాలు చేశాడు అబ్బాస్. అయితే చాలా తక్కువ సమయంలోనే ఆయన కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. మంచి టాలెంట్ ఉన్నా.. ఆ తర్వాత సైడ్ హీరో పాత్రలకు, క్యారెక్టర్ ఆర్టిస్ ల పాత్రలకే పరిమితమైపోయాడు. కారణం ఒక్కటే.. తన టాలెంట్‌‌ను సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు.

డబ్బుల కోసం ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు చేశాడు. అవి దారుణంగా ప్లాప్ అయ్యాయి. ఓ దశలో అబ్బాస్ సినిమాలు ఎప్పుడు వచ్చాయో.. ఎప్పుడు పోయాయో అబ్బాస్ కే తెలియదు. ఆ స్థాయికి దిగజారిపోయాడు అబ్బాస్. ఆ తర్వాత అలాంటి సినిమాలు కూడా అబ్బాస్ కి రాలేదు. మధ్యమధ్యలో తెలుగు , తమిళంలో అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చాడు.

Hero Abbas
Hero Abbas

చివరికి నెగెటివ్ రోల్స్ కూడా చేయాల్సి వచ్చింది. కొన్నాళ్లకు ఆ నెగిటివ్ అవకాశాలు కూడా రాలేదు. ఒక్క ‘హార్పిక్’ యాడ్ మాత్రమే అబ్బాస్ ఖాతాలో ఉంది. మొత్తానికి సినిమా ఇండస్ట్రీలో అబ్బాస్ అవకాశాలను పూర్తిగా కోల్పోయాక, ఇక బతకడం కోసం న్యూజ్ లాండ్ వెళ్ళాడు. జాబ్ దొరకలేదు. మొదట్లో న్యూజ్ లాండ్ లో పెట్రోల్ బంక్ లో కూడా పని చేయాల్సి వచ్చింది.

పెట్రోల్ బంక్ లో పని మానేసాక, భవన నిర్మాణ పనుల కోసం కూలీకి కూడా అబ్బాస్ వెళ్ళాడు. అలా అదే ఫీల్డ్ లో అనుభవం సంపాదించి.. అబ్బాస్ అక్కడే స్థిరపడిపోయాడు. ఇప్పుడు అబ్బాస్ న్యూజ్ లాండ్ లో బిల్డర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. సక్సెస్ కి చాలా దారులు ఉంటాయి, ఒక దారి మూసుకుపోతే.. మరో దారి తెరుచుకుంటుంది అని అబ్బాస్ నిరూపించాడు.

Also Read: ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్న ‘రామారావు’

Recommended Video:

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Oktelugu Epaper