spot_img
Homeఎంటర్టైన్మెంట్Supreeta : తల్లి ముందే ఆ హీరోతో రొమాన్స్ చేసిన సుప్రీత... ఆల్ ది బెస్ట్...

Supreeta : తల్లి ముందే ఆ హీరోతో రొమాన్స్ చేసిన సుప్రీత… ఆల్ ది బెస్ట్ చెప్పిన సురేఖావాణి!

Supreeta : బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్, సుప్రీత హీరో హీరోయిన్స్ గా త్వరలోనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. కాగా సురేఖ వాణి సెట్స్ లో మెరిసింది. కూతురిని హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చాలా కాలంగా సురేఖ గట్టి ప్రయత్నాలు చేసింది. సుప్రీత కి కూడా యాక్టింగ్ పట్ల బాగా ఆసక్తి ఉండటంతో .. నటన, డైలాగ్ డెలివరీ, డాన్స్ వంటి కళల్లో నైపుణ్యం పొందాలని ట్రైనింగ్ తీసుకుందట.

కెమెరా ముందుకు రాకముందే సోషల్ మీడియాలో సుప్రీత మంచి ఫాలోయింగ్ సంపాదించింది. తరచుగా హాట్ ఫోటో షూట్లు, డాన్సులు, రీల్స్ తో యూత్ ని ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఓ ప్రైవేట్ సాంగ్ కూడా చేసింది. ఇక తాజాగా బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్ కి జంటగా సుప్రీత నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. అమర్, సుప్రీత మీద మొదటి రోజు కొన్ని సీన్లు చిత్రీకరించారు. కాగా కూతురికి ఇండస్ట్రీ కొత్త కావడంతో సురేఖ వాణి దగ్గరుండి చూసుకుంటుంది.

హీరోయిన్ మదర్ హోదాలో సెట్స్ లో సురేఖ వాణి సందడి చేస్తుంది. అమర్, సుప్రీత పై చిత్రీకరించిన సీన్లు దగ్గరుండి పర్యవేక్షిస్తుంది. మోనిటర్ లో ఆ సీన్లు సురేఖ వాణి గమనిస్తున్నట్లు ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తుంటే అర్థమవుతుంది. హీరో హీరోయిన్స్ తో పాటు చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పింది. సురేఖ వాణి ఆడపాదడదా చిత్రాల్లో నటిస్తుంది. తన కూతురిని వెండితెర పై చూడాలన్న సురేఖ వాణి కల త్వరలో నెరవేరనుంది. దీంతో ఆమె చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తుంది.

అమర్ దీప్, సుప్రీతలకు ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. దాంతో మూవీతో హిట్ కొట్టి పరిశ్రమలో నిలదొక్కుకోవాలని ఆశలు పెట్టుకున్నారు. సీరియల్స్ కి బ్రేక్ ఇచ్చిన అమర్ దీప్.. సినిమాలు, డిజిటల్ సిరీస్ లపై దృష్టి పెట్టాడు. బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ తో కెరీర్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు. గతంలో పలు షాట్ ఫిలిమ్స్ లో అమర్ నటించాడు. హీరోగా అమర్ దీప్ మొదటిసారిగా నటిస్తున్నాడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. మాల్యాద్రి రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Kallanai Dam

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...
Godavari Pulasa

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....
Adani Group Airlines

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Amazon Employee Quits Job

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...
Oktelugu Epaper