Amit Shah : పార్లమెంట్ ఎన్నికల్లో.. దక్షిణాది రాష్ట్రమైన ఏపీలో ప్రయోగాలు చేసేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సిద్ధమయ్యారా? క్షేత్రస్థాయిలో నాయకులకు కూడా అదే సంకేతాలు ఇస్తున్నారా? ఎప్పుడూ లేని విధంగా ఓ స్వామీజీని రంగంలోకి దింపారా? అంటే దీనికి అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో టిడిపిలో బిజెపి తరఫున పరిపూర్ణానంద స్వామి ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసేందుకు అప్పట్లో అమిత్ షా హెలికాప్టర్ సమకూర్చారు.. 2018 తెలంగాణలోనూ పరిపూర్ణానంద స్వామి సేవలను బిజెపి ఉపయోగించుకుంది. కానీ దురదృష్టవశాత్తు మెజారిటీ స్థానాలు గెలుచుకోలేకపోయింది. ఇప్పుడు ఏపీలో, పార్లమెంటుకు కూడా ఎన్నికలు రావడంతో మళ్లీ స్వామిజి పేరు రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. గతంలో బిజెపి తరఫున ప్రచారం చేసిన ఆ స్వామీజీ.. ఇప్పుడు ఏకంగా పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఆయనకు హిందూపూర్ పార్లమెంటు స్థానం నుంచి అవకాశం దక్కిందని తెలుస్తోంది. ఏకంగా అమిత్ షా తెరవెనుక చక్రం తిప్పడంతో.. అధికారికంగా ఆయనను ప్రకటించడమే మిగిలిందని బిజెపి వర్గాలు అంటున్నాయి.
పరిపూర్ణానంద స్వామి 2014 ఎన్నికల్లో ఆయన బిజెపి తరఫున ఏపీలో విస్తృతంగా ప్రచారం చేశారు. అప్పట్లో అమిత్ షా ఆయన కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ సమకూర్చారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనూ పరిపూర్ణానంద స్వామి విస్తృతంగా పర్యటించారు.. అప్పట్లో బీజేపీకి అధికారం రాకపోయినప్పటికీ కొద్దో గొప్పో స్థానాలు దక్కించుకుంది. ఎన్నికల ప్రచారంలో పరిపూర్ణానంద స్వామిని తెగ వాడుకున్న బిజెపి.. ఆ తర్వాత ఆ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వడంలో విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. పైగా ఆయన భారత్ టుడే అనే ఒక టీవీ ఛానల్ కూడా ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి బిజెపి నుంచి ప్రోత్సాహం కరువవడంతో అది అంతగా నడవడం లేదు.. ఈ నేపథ్యంలోనే ఆ మధ్య పరిపూర్ణానంద స్వామి గోరక్షణ ఉద్యమం చేపట్టారు. ఇక అప్పటినుంచి ఆయన పెద్దగా యాక్టివ్ గా లేరు.
అయితే ఇప్పుడు ఏపీలో, అటు దేశంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో పరిపూర్ణానంద స్వామి పేరు రాజకీయాలలో వినిపిస్తోంది. హిందూపూర్ పార్లమెంట్ స్థానం నుంచి ఆయనను బిజెపి నుంచి పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి అమిత్ షా పరిపూర్ణానంద స్వామి కి సంకేతాలు పంపారని బిజెపి వర్గాలు అంటున్నాయి. హిందూపూర్ పార్లమెంట్ పరిధిలో కదిరి, రాప్తాడు, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర, హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్, విజయం సాధించారు. టిడిపి తో పొత్తుకు సంబంధించి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో బిజెపి ఈ సీటు కోరుతున్నట్టు తెలుస్తోంది. పుణ్యక్షేత్ర పరంగా హిందూపూర్ కు విశేషమైన ప్రాశస్త్యం ఉంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. హిందూ ఓటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ స్థానం లో గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో తమకు కేటాయించాలని టిడిపిని బిజెపి కోరుతోంది. పరిపూర్ణానంద స్వామి కూడా యాక్టివ్ రాజకీయాల్లో ఉండాలని కోరుకుంటున్న నేపథ్యంలో ఆయనకు బిజెపి ఈ స్థానం కేటాయించిందనే వార్తలు వస్తున్నాయి.