Surekhavani Daughter : రెండు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో ఉంది సురేఖావాణి. యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి సురేఖావాణి.. నటిగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. బొమ్మరిల్లు, రెడీ, ఢీ, దుబాయ్ శ్రీను, బాద్షా, నమో వెంకటేశా… వంటి చిత్రాలు ఆమెకు ఫేమ్ తెచ్చాయి. దర్శకుడు శ్రీను వైట్ల చిత్రాల్లో సురేఖావాణికి మంచి పాత్రలు దక్కాయి. ప్రస్తుతం ఆమె కెరీర్ నెమ్మదించింది. 2019లో సురేఖావాణి భర్త అనారోగ్యంతో మరణించారు. ఈ కారణంగా ఆమె కొన్నాళ్ళు బ్రేక్ తీసుకున్నారు.
ఆ వెంటనే లాక్ డౌన్ రావడంతో షూటింగ్స్ ఆగిపోయాయి. చాలా గ్యాప్ రావడంతో దర్శక నిర్మాతలు ఆమెను మర్చిపోయారు. మరోవైపు దర్శకుడు శ్రీను వైట్ల ఫేడ్ అవుట్ అయ్యాడు. ఆ మధ్య నాకు అవకాశాలు ఇవ్వడం లేదని సురేఖావాణి అసహనం బయటపెట్టింది. కాగా సురేఖావాణికి ఒక కూతురు ఉంది. ఆమె పేరు సుప్రీత. ఆమెను సురేఖావాణి ప్లాన్డ్ గా పాప్యులర్ చేసింది. సుప్రితతో పాటు గ్లామర్ వీడియోలు చేసి సురేఖావాణి తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసేది. ఆ విధంగా సుప్రీత జనాల్లో రిజిస్టర్ అయ్యింది.
అనంతరం సుప్రీత తనకంటూ ఇమేజ్ డెవలప్ చేసుకుంది. సుప్రీతను ఇంస్టాగ్రామ్ లో 8 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. తరచుగా సుప్రీత తన అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఆన్లైన్ చాట్ చేస్తుంది. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. కాగా ఈ పాపులారిటీతో ఆమెకు ఏకంగా హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. బిగ్ బాస్ ఫేమ్, సీరియల్ నటుడు అమర్ దీప్ హీరోగా తెరకెక్కుతున్న డెబ్యూ మూవీలో సుప్రీత హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ ప్రాజెక్ట్ మొదలై చాలా కాలం అవుతుంది. షూటింగ్ దశలో ఉంది. అమర్ దీప్-సుప్రీత కాంబో హిట్ కావడం ఖాయం అంటున్నారు. ఇక ఈ మూవీపై సురేఖావాణి చాలా ఆశలు పెట్టుకుంది. సుప్రీత స్టార్ హీరోయిన్ అయితే చూడాలి అనేది ఆమె కల. కాగా సురేఖావాణి రెండో వివాహం చేసుకుంటారనే ప్రచారం జరిగింది. ఈ వార్తలను సురేఖావాణి కూతురు సుప్రీత ఖండించింది. అలాగే బిగ్ బాస్ సీజన్ 8లో ఆమె పాల్గొంటారని కథనాలు వెలువడ్డాయి. తీరా ఆమె కంటెస్ట్ చేయకపోవడంతో ఆడియన్స్ నిరాశ చెందారు. మరి భవిష్యత్ లో అయినా… సురేఖావాణి బిగ్ బాస్ హౌస్లో కనిపిస్తుందేమో చూడాలి..
View this post on Instagram