Homeమిర్చి మసాలామెగాస్టార్ మూవీలో సమంత?

మెగాస్టార్ మూవీలో సమంత?

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాలో సమంత రంగంలోకి దిగనుందని తెలుస్తోంది. ఈ మూవీని దర్శకుడు కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ మెగాస్టార్ తో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డాడు. ఈ మూవీలో మెగాస్టార్ తోపాటు పలువురు స్టార్లు కూడా కనిపించబోతుండటంతో ఈ మూవీపై రోజురోజుకు మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ మూవీలో మెగాస్టార్ తనయుడు ఓ కీలక పాత్రలో రాంచరణ్ నటించనున్నాడు. ఈ మూవీలో […]

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాలో సమంత రంగంలోకి దిగనుందని తెలుస్తోంది. ఈ మూవీని దర్శకుడు కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ మెగాస్టార్ తో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డాడు. ఈ మూవీలో మెగాస్టార్ తోపాటు పలువురు స్టార్లు కూడా కనిపించబోతుండటంతో ఈ మూవీపై రోజురోజుకు మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ మూవీలో మెగాస్టార్ తనయుడు ఓ కీలక పాత్రలో రాంచరణ్ నటించనున్నాడు. ఈ మూవీలో రాంచరణ్ కు జోడీ సమంత నటించనున్నారని ప్రచారం జరుగుతుంది.

చిరంజీవి ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఓ పవర్ ఫుల్ ఎండోన్మెంట్ అధికారికి కనిపించబోతున్నాడు. ఈ మూవీలో ప్రధాన హీరోయిన్ గా త్రిష ఎంపికైంది. అలాగే మరో తెలుగమ్మాయి ఈషా రెబ్బా కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ పొడ్యూసర్ అయిన రాంచరణ్ కూడా ఈ మూవీలో దాదాపు 30నిమిషాల పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. రాంచరణ్ నక్సలైట్ గా చేయనునట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే రాంచరణ్ కు జోడీగా రంగస్థలం బ్యూటీ సమంత నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటీకే ఈ మాస్ సాంగ్ హీరోయిన్ రెజీనాతో మెగాస్టార్ ఆడిపాడారు. దీంతో ఈ మూవీలో చాలామంది స్టార్లు కనిపించనున్నారు. రోజుకో స్టార్ మెగాస్టార్-152వ మూవీలో వచ్చి చేరుతుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

చిరంజీవి-152వ మూవీకి ‘ఆచార్య’ అనే టైటిల్ ఖరారైనట్లు వార్తలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం రాంచరణ్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో బీజీగా ఉన్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కాంప్లీట్ అయ్యాక రాంచరణ్ ఈ మూవీలో నటించనున్నారు. ఇప్పటికే 30రోజులు కాల్షిట్లు దర్శకుడు కొరటాల శివకు కేటాయించినట్లు తెలుస్తోంది. రాంచరణ్ పాత్ర మినహా మిగతా షూటింగ్ సన్నివేశాలు జరుగుతున్నాయి. ఈ మూవీని 150కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాత రాంచరణ్ మ్యాట్నీ మూవీస్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మ్యూజికల్ బ్రహ్మ మణిశర్మ అదిరిపోయే బాణీలను సమకురుస్తున్నారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Oktelugu Epaper