Jr NTR : మెగా అభిమానులు జీవితాంతం మర్చిపోలేని డిజాస్టర్ ఫ్లాప్ ఏదైనా ఉందా అంటే అది ‘ఆచార్య’ మాత్రమే. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తే చూడాలి అనేది అభిమానుల చిరకాల కోరిక. ఆ కోరిక ఇలాంటి డిజాస్టర్ సినిమాతో చూస్తారని ఎవ్వరూ అనుకోలేదు. ఈ సినిమా ఫ్లాప్ పై చిరంజీవి కూడా చాలా బాధపడ్డాడు. ఎందుకంటే అనేక సన్నివేశాలు చిరంజీవి కి చిత్రీకరణ దశలో నచ్చలేదట. కొరటాల శివ ని మారుద్దామా? అని అడిగితే ఆయన ఒప్పుకోలేదట. దాని ఫలితమే ‘ఆచార్య’ అని చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ మీట్ లో కొరటాల శివ మీద తనకి ఉన్న కోపం, ఆవేశం మొత్తాన్ని పరోక్షంగా తీర్చుకున్నాడు. దీనికి కొరటాల శివ చాలా కసిగా ‘దేవర’ చిత్రాన్ని తీసి తన టాలెంట్ ఎలాంటిదో నిరూపించుకోవాలని అనుకున్నాడు. మరి కసిగా పని చేసి బెస్ట్ ఔట్పుట్ రాబట్టుకున్నాడా లేదా అనేది ఈ నెల 27 వ తారీఖున తెలియనుంది.
ఇది ఇలా ఉండగా ఆచార్య సినిమా ఫ్లాప్ పై జూనియర్ ఎన్టీఆర్ నేడు జరిగిన ముంబై ప్రెస్ మీట్ లో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతున్నాయి. ముందుగా రిపోర్టర్ ఎన్టీఆర్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ డైరెక్టర్ కొరటాల శివ గారి గత చిత్రం చాలా పెద్ద ఫ్లాప్ అయ్యింది. కానీ మీరు అతన్ని నమ్మి ఎలా అవకాశం ఇచ్చారు?, అతను మళ్ళీ భారీ కం బ్యాక్ ఇస్తాడని మీకు నమ్మకం ఉందా?’ అని అడుగుతుంది. దీనికి ఎన్టీఆర్ సమాధానం చెప్తూ, ‘కొరటాల శివ దర్శకుడు అయినప్పటి నుండి నేను అతనిని ఎంతగానో అభినించడం మొదలు పెట్టాను. సినిమా, సినిమాకి అతని మేకింగ్ స్టైల్ ని చూసి అతని పై అభిమానం ఇంకా పెరిగింది. అతను తియ్యాలనుకున్న సినిమాని, అతని విజన్ ని స్వేచ్ఛ గా అమలు చేసుకోనించే మంచి మనుషులు చుట్టుపక్కన ఉంటే చాలు, అతని స్టామినా కి హద్దే ఉండదు’ అంటూ చెప్పుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఇది ఎన్టీఆర్ ఎవరిని ఉద్దేశించి అన్నాడు?, చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరికీ కలిపి కౌంటర్ ఇచ్చాడా అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు.
‘స్వేచ్ఛ గా తన స్పేస్ లో పని చేసుకోనిచ్చేవారు’ లేకపోవడం వల్ల ఆచార్య సినిమాకి అలాంటి ఫలితం వచ్చిందని ఎన్టీఆర్ అంటున్నాడా? , చుట్టుపక్కన మంచి మనుషులు ఉంటే మంచి ఔట్పుట్ ఇస్తాడని ఎన్టీఆర్ అంటున్నాడు. మరి చిరంజీవి, రామ్ చరణ్ మంచి వాళ్ళు కాదా?, వాళ్ళ వల్లే ఆచార్య ఫ్లాప్ అయ్యిందని ఎన్టీఆర్ ఉద్దేశ్యమా అనేది తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ఈరోజు సాయంత్రం మూవీ టీం విడుదల చేయగా, ఈ ట్రైలర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన లభించింది, సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
Is this NTR’s analysis about Koratala Siva’s failure with Acharya?
“He just needs to be in Right Space and with right people around him…”#DevaraTrailer pic.twitter.com/DY78BxFWJJ
— M9 NEWS (@M9News_) September 10, 2024
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Is this ntrs analysis about koratala sivas failure with acharya
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com