Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi directors : చిరంజీవి లైఫ్ లో ఈ దర్శకులతో మళ్ళీ సినిమా చేయడా..? కారణమేంటంటే..?

Chiranjeevi directors : చిరంజీవి లైఫ్ లో ఈ దర్శకులతో మళ్ళీ సినిమా చేయడా..? కారణమేంటంటే..?

Chiranjeevi directors : గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంటాయి. ముఖ్యంగా క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్క ప్రేక్షకుడి తన అభిమానిగా మార్చుకున్న ఘనత కూడా తనకే దక్కుతుంది. అలాంటి చిరంజీవి ఒకానొక సమయంలో వరుస సక్సెస్ లను సాధిస్తూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి సైతం పోటీని […]

Chiranjeevi directors : గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంటాయి. ముఖ్యంగా క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్క ప్రేక్షకుడి తన అభిమానిగా మార్చుకున్న ఘనత కూడా తనకే దక్కుతుంది. అలాంటి చిరంజీవి ఒకానొక సమయంలో వరుస సక్సెస్ లను సాధిస్తూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి సైతం పోటీని ఇచ్చే స్థాయికి వెళ్లిపోయాడు. అలాంటి చిరంజీవి ఎంటర్ కెరీర్ లో ఎంతోమంది స్టార్ డైరెక్టర్ తో కలిసి పని చేశా. అయితే ఒక ముగ్గురు దర్శకులతో సినిమాలు చేసినప్పటికి ఇకమీదట వాళ్లతో సినిమాలు చేయాలనే ఇంట్రెస్ట్ కూడా తనకు లేకుండా పోయిందని పలు సందర్భాల్లో ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇంతకీ ఆ ముగ్గురు దర్శకులు ఎవరు అంటే గతంలో చిరంజీవి హీరోగా ‘స్టువర్టుపురం పోలీస్ స్టేషన్’ అనే సినిమా యండమూరి వీరేంద్రనాథ్ డైరెక్షన్ లో తెరకెక్కింది. కెరియర్ మొదట్లో రైటర్ గా చలామణి అవుతున్నప్పటికి తనని దర్శకుడిగా చేయాలనే కోరిక చిరంజీవికి కలిగింది. ఇక అప్పటికే తను దర్శకత్వ విభాగంలో రాణించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఆ విషయం తెలుసుకున్న చిరంజీవి తనతో సినిమా చేసే అవకాశం ఇచ్చాడు. స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ సినిమాని తెరకెక్కించే బాధ్యతలను తనకి అప్పజెప్పాడు.

ఆయన ఆ సినిమాని హ్యాండిల్ చేయలేక మధ్యలో తప్పుకున్నాడు. ఇక చేసేదేమీ లేక చిరంజీవి ఆ సినిమాను కంప్లీట్ చేసి రిలీజ్ చేశాడు. ఇక మరోసారి యండమూరి వీరేంద్రనాథ్ డైరెక్షన్ లో సినిమా చేసే అవకాశమైతే లేదని చిరంజీవి అప్పట్లో తన సన్నిహిత వర్గాల దగ్గర చెప్పాడు…

శివ సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన రామ్ గోపాల్ వర్మ సైతం చిరంజీవితో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తయిన తర్వాత రామ్ గోపాల్ వర్మకి బాలీవుడ్ నుంచి ఆఫర్ రావడంతో చిరంజీవి సినిమాను పక్కనపెట్టి మరి బాలీవుడ్ కి వెళ్లిపోయాడు. దాంతో చిరంజీవి తీవ్ర మనస్థాపానికి గురై రామ్ గోపాల్ వర్మతో ఇక సినిమా చేసేది లేదనే నిర్జయ తీసుకున్నాడు…

ఇక సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న కొరటాల శివతో సైతం ఆయన ‘ఆచార్య’ అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో చిరంజీవి సూచించిన మార్పులు చేర్పులు తను చేయలేదట. దానివల్ల ఆ మూవీ ప్లాప్ అయిందని చిరంజీవి కొరటాల శివ తో మరో సినిమా చేసేది లేదు అంటూ ఇంటర్వ్యూలో కూడా క్లారిటి ఇచ్చే ప్రయత్నం చేశాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper