Geethu Mohandas: అర్జున్ రెడ్డి సినిమాతో బోల్డ్ కంటెంట్లతో సైతం సక్సెస్ ని సాధించొచ్చు అని ప్రూవ్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ… రన్బీర్ కపూర్ ను హీరోగా పెట్టి చేసిన ‘అనిమల్’ సినిమాలో సైతం బోల్డ్ సీన్స్ ఉంటాయి. మొత్తానికైతే సందీప్ రెడ్డివంగ టాప్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరైనా సరే బోల్డ్ కంటెంట్ తో సినిమాలు చేస్తున్నారంటే సందీప్ రెడ్డివంగా పేర్లు ప్రస్తావించకుండా ఉండలేరు.
ఆయన వేసిన బాటలోనే చాలామంది దర్శకులు నడుస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు టాక్సిక్ సినిమాతో దర్శకురాలిగా తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్న గీతూ మోహన్ దాస్ సైతం ఈ సినిమాలో కొన్ని బోల్డ్ సన్నివేశాలైతే పెట్టిందట. ఇక ఆమెను ప్రస్తుతానికి లేడీ సందీప్ రెడ్డివంగా అని పిలుస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా ఆమె ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది. ప్రేక్షకులందరిని తనవైపు తిప్పుకోగలుగుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇప్పటికే ఈ సినిమా మీద ఇండియా వైడ్ గా చాలా మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉంటే పర్లేదు లేకపోతే మాత్రం ప్రేక్షకులు తీవ్రమైన నిరాశను వ్యక్తం చేసే అవకాశమైతే ఉంది.
ఒకవేళ వాళ్ళు డిసపాయింట్ అయితే మాత్రం సినిమా ఆశించిన మేరకు సక్సెస్ ని సాధించకపోవచ్చు. కాబట్టి ఆమె ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదట. ఇప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ లో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాని టాప్ లెవల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు… ఇక ఈ సినిమా తో పాటు బోల్డ్ సీన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత గీతూ మోహన్ దాస్ ను లేడీ సందీప్ రెడ్డి వంగ అని పిలవడం పక్కా అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…