Brothers Sacrifice for Love Marriage:ప్రేమ ఎంత గొప్పదో ఆ కుటుంబ సభ్యులు నిరూపించారు.. ప్రేమించిన వారిని దూరం చేయకుండా వారిని ఒక్కటి చేయాలని నిర్ణయించుకున్నారు.. తమకు పెళ్లిడు వయసు వచ్చినా.. తమ తమ్ముడు ప్రేమను అంగీకరించి వారికి దగ్గర ఉండి పెళ్లి చేశారు. అంతేకాకుండా పెళ్లికూతురుకు అమ్మానాన్నలు లేకపోవడంతో.. మా అమ్మానాన్నలే నీకు అమ్మానాన్నలు అంటూ.. ఆదరించి వారి ఇంట్లో కుటుంబ సభ్యులుగా చేర్చుకున్నారు. అయితే ఈ సమయంలో వారిలో ఏర్పడిన భావోద్వేగా వీడియో వైరల్ గా మారింది..
సాధారణంగా ప్రతి కుటుంబంలో వయసును బట్టి పెళ్లిళ్లు చేస్తారు. ముందుగా పెద్దవారికి.. ఆ తర్వాత చిన్నవారికి వివాహం చేస్తారు. ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఉంటే.. ముందుగా అన్నలకు వివాహం చేసిన తర్వాతే తమ్ముళ్లకు చేస్తారు.. ఈ తరుణంలో తమ్ముడు ప్రేమలో పడితే అన్నల పెళ్లి కోసం వెయిట్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం తమ్ముడు ప్రేమ విఫలం కావద్దని ఉద్దేశంతో తమకు పెళ్లీడు వయసు వచ్చినా కూడా.. తమ పెళ్లి గురించి ఆలోచించకుండా తమకంటే ముందుగానే తమ్ముడికి పెళ్లి చేశారు.
అంతేకాకుండా తమ్ముడు ప్రేమించిన అమ్మాయికి అమ్మానాన్నలు ఎవరూ లేరు.. ఈ సందర్భంగా వారు మా అమ్మానాన్నలే.. నీకు కూడా అమ్మానాన్నలు.. అంటూ నూతన వధువును ఆదరించారు. అంతేకాకుండా కొత్త జంటను వారితోనే జీవించేలా ఏర్పాటు చేసుకున్నారు. అయితే వారు పెళ్లి చేసిన సందర్భంగా అన్నదమ్ములు అంతా కలిసి భావోద్వేగం తో ఏడ్చేశారు. ఈ సమయంలో పెళ్లికూతురు కూడా ఏడుపును ఆపుకోలేకపోయింది..
కుటుంబ సభ్యుల మధ్య.. అందులోనూ అన్నదమ్ముల మధ్య ఆప్యాయత ఎలా ఉంటుందో ఈ వీడియోను బట్టి చూస్తే తెలుస్తుంది. నేటి కాలంలో ప్రేమించిన వారిని విడగొట్టాలని చాలామంది చూస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం సొంత అన్నదమ్ములు తమ్ముడి ప్రేమను అంగీకరించడమే కాకుండా తమకంటే ముందుగా పెళ్లి చేయడంపై చాలామంది ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా ఆ అన్నలకు కూడా త్వరలో పెళ్లిళ్లు కావాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
తమ్ముడు ప్రేమించిన అమ్మాయికి చిన్నప్పుడే తల్లిదండ్రులు లేరని తెలిసి..
"మా అమ్మానాన్నే నీకు అమ్మానాన్నలు" అని ధైర్యం చెప్పి.
అన్నలకు పెళ్లి వయసు వచ్చినా, తమ కంటే ముందే తమ్ముడి పెళ్లి చేసి, ఇద్దరినీ దగ్గరుండి ఒక్కటి చేశారు ఇద్దరు అన్నలు 🫡
వాళ్ల పెళ్లిళ్లు కూడా ఘనంగా జరగాలని… pic.twitter.com/FFiXQZo2Gg
— AVM (@AvmNews7) August 17, 2026