Chicken Legs Benefits: మనలో చాలామందికి చికెన్ అంటే చాలా ఇష్టం. ఆదివారం అయిందంటే చాలు చికెన్ షాప్ ముందు క్యూ కడుతుంటాం. లెగ్ పీస్ ల కోసం చికెన్ షాప్ యజమానిని రిక్వెస్ట్ చేస్తుంటాం. చికెన్ లెగ్ పీస్ తింటుంటే అదోరకమైన ఆనందం. ఇక కొంతమంది అయితే లివర్ ఇష్టంగా తింటుంటారు.
నిజానికి మటన్ కంటే చికెన్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది తినగానే కొద్ది గంటలలోనే జీర్ణం అవుతుంది. మటన్ ఆలా కాదు. అది హై ప్రోటీన్ ఫుడ్. పైగా జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. పైగా ఇటీవల కాలంలో మటన్ రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. తినే వాళ్ళు పెరిగిపోవడంతో ధరలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. హైదరాబాదు లాంటి నగరాలలో కిలోమీటర్లు వచ్చేసి 1000 నుంచి 1200 వరకు పలుకుతోంది. ఇక మారుమూల గ్రామాలలో అయితే 800 నుంచి 1000 రూపాయల వరకు పలుకుతోంది. పేదలు.. దిగువ మధ్య తరగతి వారు మటన్ కొనుగోలు చేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. అందువల్లేవారు చికెన్ కొనుగోలు చేస్తుంటారు.
చికెన్ కొన్ని సందర్భాలలో కొండెక్కి కూర్చున్నప్పటికీ.. మిగతా సమయాలలో అందుబాటులోనే ఉంటుంది. చికెన్ కొనుగోలు చేసేవారు ఎక్కువగా లెగ్ పీస్ లేదా లివర్ ఇష్టపడుతుంటారు. షాపు ఓనర్లను ఆ ముక్కలు మాత్రమే వేయాలని కోరుతూ ఉంటారు. పైగా వేడి వేడి అన్నంలో లెగ్ పీస్ కలుపుకొని తింటుంటే ఆ మజానే వేరని చెబుతుంటారు. ఇక లివర్ కు గట్టిగా కారం ఉప్పు దట్టించి.. మసాలా పట్టించి.. వేడివేడి అన్నంలో కలుపుకుని తింటూ ఉంటే స్వర్గం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది.
లెగ్ పీస్ కంటే.. లివర్ కంటే.. కోడిలో ఇంకొక పార్ట్ అత్యంత ముఖ్యమైనది. కాకపోతే దీనిని ఎవరు అంతగా ఇష్టపడరు. కోడికాళ్లను పులుసుగా పెట్టుకొని.. వేడివేడి అన్నంలో తింటే ఉంటుంది.. నా సామి రంగ అదిరిపోతుంది అంతే.. వైద్యులు కూడా ఇదే చెప్తున్నారు. కోడికాళ్లలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల దృఢత్వానికి దోహదం చేస్తూ ఉంటుంది. అందువల్లే కోడి కాళ్ళ పులుసు అప్పుడప్పుడు తినాలని వైద్యులు చెబుతుంటారు. అయితే జీర్ణ సంబంధ సమస్యలను వారు.. ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు తినడమే మంచిది.
పాఠకులకు గమనిక
ఈ కథనం వివిధ మార్గాల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా అందించాం. కోడి కాళ్ళ పులుసు తినేవాళ్లు ఒకసారి వైద్యుల సలహాలు తీసుకొని.. తినాలని సూచిస్తున్నాం.