Homeజాతీయ వార్తలుఆవును చంపారు.. సానియా మీర్జాపై విచారణ జరపాలి: రాజాసింగ్ డిమాండ్

ఆవును చంపారు.. సానియా మీర్జాపై విచారణ జరపాలి: రాజాసింగ్ డిమాండ్

 Cow shot dead in Sania Mirza’s farmhouse

ఆవు అంటే హిందూ ధర్మంలో ఒక దేవుడితో సమానమని..అట్లాంటి పవిత్రమైన గోమాతను కాల్చి చంపిన వారిపై నార్మల్ కేసు కాకుండా హత్య కేసు బుక్ చేయాలని తెలంగాణలోని ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. వికారాబాద్ అడవుల్లో ఉన్న సానియామీర్జా ఫాంహౌస్ లో ఇటీవల ఒక ఆవును చంపారని.. దీనిపై విచారణ జరపాలని ఆయన కోరారు. తాజాగా మీడియాతో మాట్లాడిన రాజాసింగ్.. టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అయిన సానియా మీర్జాపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. వికారాబాద్ జిల్లా దామగుండలో సానియా మీర్జా ఫాంహౌస్ లో జరిగిన కాల్పుల ఘటనపై తాజాగా రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. సానియా మీర్జాపైన కూడా లోకల్ పోలీసులతో కాకుండా ప్రత్యేక స్పెషల్ టీంతో విచారణ జరపాలని.. ఇందులో సానియా మీర్జా ప్రమేయం ఉందా లేదా నిగ్గుతేల్చాలని రాజాసింగ్ ప్రభుత్వాన్ని కోరారు.

Also Read: అప్పటివరకు స్కూళ్లు తెరవొద్దు.. కేంద్రం ఆదేశం

గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని.. ఇదే ఫాంహౌస్ లోకి నెమలి, వేరే వేరే జంతువులు వస్తే కాల్చి చంపారని ఇన్ఫర్మేషన్ వస్తోందని.. అది బయటపడలేదని రాజాసింగ్ ఆరోపించారు. నెమలి చంపారనే దానిపై ఎఫ్ఐఆర్ అయ్యిందని చెబుతున్నారన్నారు. ఎప్పుడు ఎన్ని సార్లు జరిగాయనే దానిపై మొత్తం విచారణ జరపాలని ప్రజల ముందు పెట్టాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఫాంహౌస్ సెక్యూరిటీ గార్డ్ ఉమర్ కానీ.. ఆయనకు ఎంత మంది సపోర్ట్ ఉన్నారో అందరిపైనా చర్యలు తీసుకోవాలని తాను ముఖ్యమంత్రిని కోరుతున్నానని రాజాసింగ్ తెలిపారు.

దామగుండలో అడవి ఉందని.. అక్కడే సానియా మీర్జాకు ఫాంహౌస్ ఉందని.. మూడు నాలుగు రోజుల క్రితం సానియా మీర్జా ఫాంహౌస్ సెక్యూరిటీ గార్డ్ ఒక ఆవును తుపాకీతో కాల్చి చంపాడని మీడియాలో వస్తున్నాయని రాజాసింగ్ తెలిపారు. కానీ వాస్తవం ఏంటంటే.. ఆ గ్రామస్తులు చెబుతున్న దాని ప్రకారం.. ఫాంహౌస్ లో సానియా మీర్జా కూడా ఉందని.. ఆమె ముందే ఈ సంఘటన జరిగిందని.. ఆ ఊరోళ్లు సానియా మీర్జానే షూట్ చేసిందని అంటున్నారని రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశాడు.

Also Read: సంచలనం: కేసు నుంచి తప్పించాలని కోర్టులో జగన్ పిటీషన్

తాను ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒకటే అడుగుతున్నానని.. తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ అయినా సానియా మీర్జా ఒక ఆవును కాల్చి చంపారని చెబుతుంటే ఆమెపైన ఏం ఎఫ్ఐఆర్ అయ్యింది? ఏం కేసు పెట్టారు.? మామూలు కేసు పెడుతారా అని రాజాసింగ్ ప్రశ్నించారు. సానియా మీర్జాపై రాజాసింగ్ ఆరోపణలు సంచలనంగా మారింది.

https://www.youtube.com/watch?v=igqHXCy1CGE&feature=emb_title

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper