Homeఎంటర్టైన్మెంట్ఎన్టీఆర్ ముస్లిం గెటప్ తీయడం కుదరదట

ఎన్టీఆర్ ముస్లిం గెటప్ తీయడం కుదరదట

NTR Muslim Getup
దర్శక ధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. 400 కోట్ల పైచిలుకు వ్యయంతో రూపొందుతున్న ఈ భారీ మల్టీస్టారర్ మీద దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. చరిత్రలోని అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా రాజమౌళి రాసుకున్న ఫిక్షనల్ కథ ఇది. నిజానికి చరిత్రలో వీరిరువురికీ ఎలాంటి సంబంధం లేదు. కానీ అంతటి వీరులు ఒకరినొకరు కలుసుకుని ప్రభావితం చేసుకుంటే ఎలా ఉంటుందనేదే జక్కన రాసుకున్న కథ.

Also Read: శ్రీహరి విషయంలో ముందే చెప్పిన బాలయ్య.. ఎమోషనల్?

అయితే ఇటీవలే సినిమా నుండి కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ తాలూకు టీజర్ విడుదలైంది. టీజర్ ప్రేక్షకులందరికీ విపరీతంగా నచ్చేసింది. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అందరూ. కానీ టీజర్ చివర్లో తారక్ తలపై టోపీ పెట్టుకుని ముస్లిం వేషధారణలో కనిపిస్తారు. ఇదే వివాదానికి దారితీసింది. నిజాం రాజుల మీద, రజాకార్ల మీద యుద్ధం చేసిన భీమ్ ఇలా ముస్లిం టోపీ పెట్టుకుని కనిపించడం ఏమిటని ఆదివాసీలు మండిపడుతున్నారు. వెంటనే ఆ సన్నివేశాలను తొలగించాలని, చరిత్రను వక్రీకరిస్తే సినిమా విడుదలయ్యాక థియేటర్ల మీద దాడిచేస్తామని ఆదివాసీలు హెచ్చరిస్తున్నారు.

Also Read: మహేష్ దూకుడుకి ఎన్టీఆర్ చెక్..!

కానీ సినిమాలో కొమురం భీమ్ ప్రతిష్టకు భంగం కలిగించే సన్నివేశాలేవీ ఉండవని, సినిమా చూసాక ఎన్టీఆర్ తలా మీద టోపీ ఎందుకు ఉందనేది అర్థమవుతుందని చిత్ర సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. అలాగే సినిమాలో భీమ్ పాత్ర అజ్ఞాతంలోకి వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ ముస్లిం వేషధారణలో ఉంటారని, వాటిని తొలగించడం కుదరదని కూడ తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ వివాదం మీద రాజమౌళి కానీ చిత్ర నిర్మాత కానీ స్పందించకపోవడం గమనార్హం.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

2 COMMENTS

Comments are closed.

RELATED ARTICLES

Most Popular