Homeఎంటర్టైన్మెంట్Anupama Parameswaran : నరేష్ లాంటి సీనియర్ నటుడు ఇలా చేస్తాడని అనుకోలేదంటూ అనుపమ పరమేశ్వరన్...

Anupama Parameswaran : నరేష్ లాంటి సీనియర్ నటుడు ఇలా చేస్తాడని అనుకోలేదంటూ అనుపమ పరమేశ్వరన్ హాట్ కామెంట్స్..

Anupama Parameswaran : ఈమధ్య కాలం లో లవ్ బ్రేకప్ వార్తలతో బాగా వైరల్ అవుతున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ప్రముఖ తమిళ యంగ్ హీరో ధృవ్ విక్రమ్ తో గత కొంతకాలం నుండి ప్రేమాయణం నడుపుతూ, డేటింగ్ చేస్తూ వచ్చిన ఈ హీరోయిన్, రీసెంట్ గానే ఒక స్టార్ హోటల్ లో అతనితో గొడవ పెట్టుకొని , తమ రిలేషన్ కి బ్రేకప్ చెప్పినట్టు కోలీవుడ్ వర్గాల్లో బాగా ప్రచారం అవుతున్న వార్త. ముఖ్యంగా బ్రేకప్ […]

Anupama Parameswaran : ఈమధ్య కాలం లో లవ్ బ్రేకప్ వార్తలతో బాగా వైరల్ అవుతున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ప్రముఖ తమిళ యంగ్ హీరో ధృవ్ విక్రమ్ తో గత కొంతకాలం నుండి ప్రేమాయణం నడుపుతూ, డేటింగ్ చేస్తూ వచ్చిన ఈ హీరోయిన్, రీసెంట్ గానే ఒక స్టార్ హోటల్ లో అతనితో గొడవ పెట్టుకొని , తమ రిలేషన్ కి బ్రేకప్ చెప్పినట్టు కోలీవుడ్ వర్గాల్లో బాగా ప్రచారం అవుతున్న వార్త. ముఖ్యంగా బ్రేకప్ తర్వాత ఆమె తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పెట్టిన కొన్ని పోస్టులు సంచలనం గా మారాయి. ఈ నేపథ్యం లో ఆమె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘క్రేజీ కళ్యాణం’ టీజర్ లాంచ్ అయ్యింది. నిన్న హైదరాబాద్ లో ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేసి ఈ టీజర్ ని లాంచ్ చేశారు.

ఈ ఈవెంట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో రిపోర్టర్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు అనుపమ పరమేశ్వరన్ చాలా ఘాటుగా రెస్పాన్స్ ఇచ్చింది. అయితే అంతకు ముందు ఆమె ఈ చిత్రం లో ప్రధాన పాత్ర పోషించిన సీనియర్ నటుడు నరేష్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ ‘ఈ చిత్రం కోసం నరేష్ గారు చాలా కష్టపడ్డారు. కొన్ని సన్నివేశాల్లో ఆయన కష్టాన్ని చూసి , ఈ వయస్సులో ఆయనకు ఇవన్నీ అవసరమా అనిపించింది. ఈ చిత్రం లో వర్షం బ్యాక్ డ్రాప్ లో ఒక సన్నివేశం ఉంది. అసలు బయట చాలా చలిగా ఉంది. ఇలాంటి సమయం అర్థరాత్రి వరకు వర్షం లో తడుస్తూ కూర్చుకున్నారు. ఇంత యంగ్ వయస్సు లో నాకే అలాంటి సన్నివేశాల్లో నటించాలంటే చాలా భయం గా అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఆయన ఎలా చేశారో అర్థం కావడం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇంకా ఆమె మాట్లాడుతూ ‘నరేష్ గారితో ఇది నాకు మూడవ సినిమా అన్నమాట. మా ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం ‘అఆ’. ఆయన నా లక్కీ చార్మ్. అందులో ఆయన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. తర్వాత మా ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన శతమానం భవతి మరో పెద్ద హిట్ గా నిల్చింది. ఇప్పుడు క్రేజీ కళ్యాణం చేసాం. ఈ సినిమా కూడా కచ్చితంగా హిట్ అవుతుందని బలంగా నమ్ముతున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది అనుపమ పరమేశ్వరన్. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper