Anupama Parameswaran: యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న యంగ్ హీరోయిన్స్ లో ఒకరు అనుపమ పరమేశ్వరన్. కేవలం అందాల ఆరబోతకు మాత్రమే పరిమితం అవ్వకుండా, నటనకు ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు చేయడమే ఈమె ప్రత్యేకత. ఈమె మన తెలుగు ఆడియన్స్ కి ‘అ..ఆ’ అనే చిత్రం తో ఎంట్రీ ఇచ్చింది. తొలిసినిమాలోనే విలన్ క్యారెక్టర్ ద్వారా ఈమె మన ఆడియన్స్ కి పరిచయం అయ్యిందంటేనే అర్థం చేసుకోవచ్చు , ఆమె సినిమాల సెలెక్షన్స్ ఎలా ఉంటుంది అనేది. ఇక ఆ తర్వాత ఆమె చేసిన ప్రతీ చిత్రం నటనకు ప్రాధాన్యత ఉన్నదే. అలా కోట్లాది మంది యూత్ ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టింది ఈమె. అనుపమ పేరు చెప్తేనే వారిలో ఒక వైబ్రేషన్స్ మొదలు అవుతాయి. అలాంటి అనుపమ ఒక యంగ్ హీరో తో ప్రేమలో పడింది అనే వార్త తెలుసుకున్న ఆ యువత గుండె బద్దలైంది అనే చెప్పాలి.
అలా కోట్లాది మంది తెలుగు యువత దిష్టి తగిలిందో ఏమో తెలియదు కానీ , అనుపమ రీసెంట్ గానే ఆ యంగ్ హీరో కి బ్రేకప్ చెప్పేసింది. ఆ యంగ్ హీరో మరెవరో కాదు , కోలీవుడ్ సీనియర్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్. వీళ్లిద్దరు కలిసి గతం లో ‘బైసన్’ అనే చిత్రం లో నటించారు. ఈ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రానికి ముందే వీళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలైంది, డేటింగ్ కూడా చేసుకుంటూ వచ్చారట. అయితే రెండు రోజుల క్రితమే వీళ్లిద్దరి లవ్ బ్రేక్ అయ్యింది. కోలీవుడ్ లో ఇప్పుడు ఇది హాట్ న్యూస్. తన బ్రేకప్ ని పరోక్షంగా ప్రకటిస్తూ , ఇన్ స్టాగ్రామ్ లో అనుపమ పరమేశ్వరన్ పెట్టిన పోస్టులు కొన్ని ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఆమె మాట్లాడుతూ ‘కొన్నిసార్లు ప్రశాంతత కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఈరోజు నాకు ఆ ప్రశాంతత లభించింది. ఇక నుండి నా గళాన్ని నేను వినిపించగలను , నా జీవితాన్ని ఎలా జీవించాలో , నా నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇక ఎవరి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు , ఎలాంటి భయం కూడా లేదు. ప్రేమలో పడిన తర్వాత నన్ను నేను పూర్తిగా కోల్పోయాను. ఎలాంటి సమయం లో అయినా నాతో తోడుగా నిలబడిన అభిమానులకు ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చింది అనుపమ పరమేశ్వరన్. అందుకు సంబంధించిన పోస్టు ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. అంతే కాదు ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ధృవ్ విక్రమ్ ని అన్ ఫాలో కొట్టింది.
View this post on Instagram
