Kiskindhapuri Movie Twitter Talk: ‘భైరవం’ చిత్రం తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Srinivas) హీరో గా నటించిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘కిష్కిందపురి'(Kiskindhapuri Movie) చిత్రం నేడు భారీ లెవెల్ లో విడుదలైంది. థియేట్రికల్ ట్రైలర్ తో ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అనే ఫీలింగ్ కలిగించారు. అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. విడుదలకు ముందు హీరో, హీరోయిన్లు భారీ లెవెల్ లో ఈ చిత్రాన్ని ప్రమోట్ కూడా చేశారు. అలా మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ఓవర్సీస్ ప్రీమియర్ షోస్ నుండి ఎలాంటి టాక్ వచ్చిందో ఒకసారి ట్విట్టర్ రివ్యూస్ ని పరిశీలిద్దాం. ట్విట్టర్ లో అయితే ఈ సినిమాకు అత్యధికంగా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ కం బ్యాక్ మూవీ అని చాలా మంది అంటున్నారు.
Also Read: ‘మిరాయ్’ ట్విట్టర్ టాక్..ప్రభాస్ ఎంట్రీ కి సెన్సేషనల్ రెస్పాన్స్..సినిమా హిట్టా? ఫట్టా?
ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని, అనేక సన్నివేశాలకు సీట్ మీద నుండి పైకి లేచి అరిచినా సందర్భాలు ఉన్నాయని అంటున్నారు నెటిజెన్స్. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అయితే మైండ్ నుండి పోవడం కష్టమని అంటున్నారు. అంత బాగా వచ్చిందట. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే బాగా తగ్గింది కానీ, ఓవరాల్ గా ఒక మంచి డీసెంట్ సినిమాని చూసిన ఫీలింగ్ ని కలిగిస్తుందట. హారర్ జానర్ లో ఇప్పటికే ఎన్నో రకాల సినిమాలను చూసేసాము. కానీ ఈ సినిమా మాత్రం ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని కాన్సెప్ట్ తో తెరకెక్కింది అని చెప్పొచ్చు. కానీ కొన్ని సన్నివేశాలు రొటీన్ మూవీ స్క్రీన్ ప్లే తో లాగాల్సి వచ్చింది. ఇది ఏ సినిమాకు అయినా తప్పదు అనుకోండి, ఓవరాల్ గా హారర్ సినిమాలను చూడాలని కోరుకునేవాళ్ళు ఈ చిత్రాన్ని మిస్ అవ్వకుండా చూసేయండి. ఒక మంచి 4DX డాల్బీ అట్మాస్ థియేటర్ లో చూస్తే ఇంకా అద్భుతమైన థియేట్రికల్ అనుభూతి కలుగుతుంది. ఇకపోతే ట్విట్టర్ లో వచ్చిన రివ్యూస్ కొన్ని మీ కోసం ఎక్సక్లూసివ్ గా అందిస్తున్నాము, చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
#Kishkindhapuri: A Finest Horror thriller with brilliant chilling ideas in recent times. The solid first half and sensational second half makes it a must watch experience #BellamkondaSreenivas rocks with his presence and performance. Kudos to director #Koushik for delivering…
— Filmy Bowl (@FilmyBowl) September 12, 2025
#Kishkindhapuri – 3/5 ratings
Kishkindhapuri delivers the thrilling experience and fear in right moments. The unique ideas in Horror genre will surprise everyone. The suspense, impactful ghost reveal scenes, twists and chilling background score are major highlights.… pic.twitter.com/uFdqXjBZuq
— Box Office (@Box_Office_BO) September 12, 2025
Show completed :- #Kishkindhapuri
My rating 3.25/5
Blockbuster film from @BSaiSreenivas
Extraordinary BGM
Well written story
Perfect runtimeMust watch Horror Film pic.twitter.com/K0UVN4vrLg
— venkatesh kilaru (@kilaru_venki) September 12, 2025
Superb 1st Half & Good Second Half. Excellent Sound Mixing & BGM #Kishkindhapuri https://t.co/ngvC9ioNQb
— Gani タラク (@NTRfanTillDeath) September 12, 2025