Akhil Akkineni: అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి హీరో తమకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అఖిల్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇక మీదట చేయబోతున్న సినిమాల విషయంలో ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. తనకంటూ ఒక ఐడెంటిటి ని సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. రీసెంట్ గా లెనిన్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన అఖిల్ తొందరలోనే నాగార్జున సూపర్ హిట్ సినిమాని రీమేక్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నాగార్జున హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన ‘నిన్నే పెళ్ళాడుతా’ సినిమా అఖిల్ కి చాలా ఇష్టమట. ఆ సినిమాని పర్ఫెక్ట్ గా అలాగే పోట్రే చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే ఆ సినిమాని రీమేక్ చేయాలని అఖిల్ చూస్తున్నాడు.
తను అనుకున్నట్టుగానే ఈ సినిమాని అంతే ఎఫెక్టివ్ గా తీయగలిగే దర్శకుడు ఎవరైనా ఉన్నారా? కథని కొంచెం అటు ఇటు చేంజ్ చేసి ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తే ఇప్పుడున్న ప్రేక్షకులు ఈ సినిమాని చూసే అవకాశాలు ఉన్నాయా? అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం అఖిల్ కొంతమంది రైటర్లతో నిన్నే పెళ్ళాడుతా సినిమాకు సంబంధించిన రీ రైటింగ్ ప్రోగ్రాం అయితే చేపట్టాడట. తను ఉన్నట్టుగా కథ కుదిరితే మాత్రం సినిమాని రీమేక్ చేస్తారట. లేకపోతే మాత్రం కథను పక్కనపెట్టి ఒరిజినల్ స్టోరీలతో సినిమాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. గతంలో నాగచైతన్య నిన్నే పెళ్ళాడుతా సినిమాని రీమేక్ చేయాలని చూశాడు. కానీ కథ అంత పర్ఫెక్ట్ గా సెట్ కాకపోవడంతో ఆయన దాన్ని పక్కన పెట్టాడు.
అఖిల్ సైతం ఆ సినిమా కథ విషయంలో ఆయన అనుకున్నట్టుగా కథ కుదిరితేనే సినిమా చేస్తాడట. లేకపోతే దానిని పక్కన పెట్టేస్తాడట. కారణమేంటంటే రీమేక్ పేరుతో ఆ కథను చెడగొట్టడం తనకి ఇష్టం లేదట… ఇక ఇదిలా ఉంటే ఇప్పుడున్న జనరేషన్ ను మెప్పించగలిగే విధంగా ఈ సినిమాని తెరకెక్కించగలుగుతారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…