Srinivasa Mangapuram First Review: ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఎంతమంది హీరోలు వచ్చినా కూడా ప్రేక్షకులు వాళ్ళని ఆదరిస్తున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు సూపర్ స్టార్ గా ఎదిగిన తర్వాత వాళ్ళ బావ అయిన సుధీర్ బాబు ఇండస్ట్రీకి వచ్చాడు. ఆయన తక్కువ బడ్జెట్ లో సినిమాలను చేసుకుంటూ విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు… ఆ తర్వాత వాళ్ళ అక్క అయిన మంజుల సైతం ప్రొడ్యూసర్ గా రాణిస్తూ ప్రేక్షకుల అభిరుచి మేరకు మంచి సినిమాలను నిర్మించే పనిలో బిజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు మహేష్ బాబు వాళ్ళ అన్న రమేష్ బాబు కొడుకు అయిన జయ కృష్ణ సైతం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ షో ను ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ఇండస్ట్రీ పెద్దలకైతే వేశారు. వాళ్లు ఈ సినిమాని చూసి సినిమా మీద వాళ్ళ రివ్యూ ని కూడా చెప్పారు. దాంతో ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండబోతుందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
శ్రీనివాస మంగాపురం లో ఉండే జయ కృష్ణ ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. తన ప్రేమ వల్ల అక్కడ లోకల్ గా ఉండే కొంతమందితో అతనికి విభేదాలు ఏర్పడతాయి. దానివల్ల ఆయన వాళ్ల నుంచి ఎలా తప్పించుకున్నాడు. తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అనేదే ఈ సినిమా స్టోరీగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో జయకృష్ణ చాలా డీసెంట్ యాక్టింగ్ ని కనబరిచినట్టుగా తెలుస్తుంది. హీరోయిన్ నటన కూడా ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది. అజయ్ భూపతి డైరెక్షన్ అయితే ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది అంటూ సినిమా ని చూసిన సినీ పెద్దలు కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఈవారం మంచి విజయాన్ని సాధించబోతుంది అంటూ వాళ్ళు చెబుతున్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలు వైరల్ అవుతున్నాయి.
అజయ్ భూపతి ‘మంగళవారం’ సినిమా తర్వాత మరోసారి ఒక మంచి లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అంటూ అతని అభిమానులు సైతం ఆనందపడుతున్నారు…మ్యూజిక్ ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యిందని కూడా చెబుతున్నారు.
బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో అజయ్ భూపతి స్పెషల్ కేర్ తీసుకొని మ్యూజిక్ డైరెక్టర్ నుంచి చాప.మంచి బ్యా గ్రౌండ్ స్కోర్ ని ఇప్పించుకున్నట్టుగా కూడా అర్థమవుతుంది. ఇక ఏదేమైనా ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. జయకృష్ణ మహేష్ బాబు మాదిరిగా సూపర్ స్టార్ గా ఎదుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…