Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తనదైన శైలిలో వరుస సినిమాలతో దూసుకుపోతూ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. కెరీర్ ప్రారంభం నుంచే వైవిధ్యమైన పాత్రలు, విభిన్న కధాంశాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవల ఆయన నటించిన ” గద్దలకొండ గణేశ్ ” మూవీ మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో మాస్స్ ఆడియన్స్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ” గని”. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న […]
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తనదైన శైలిలో వరుస సినిమాలతో దూసుకుపోతూ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. కెరీర్ ప్రారంభం నుంచే వైవిధ్యమైన పాత్రలు, విభిన్న కధాంశాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవల ఆయన నటించిన ” గద్దలకొండ గణేశ్ ” మూవీ మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో మాస్స్ ఆడియన్స్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ” గని”. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ వచ్చింది.

https://twitter.com/IAmVarunTej/status/1453234521177051149?s=20
ఈ మూవీ నుంచి తొలి సాంగ్ ” గని ఆంతమ్ ” పాటను మూవీ యూనిట్ విడుదల చేశారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్ లో వరుణ్ తేజ్ లుక్ తో సినిమాలపై అంచనాలను పెంచేశాడు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ కోసం వరుణ్ తేజ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు.
అలానే ఈ చిత్రంలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ‘గని ఫస్ట్ పంచ్’ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాను డిసెంబర్ 3న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.