Homeఎంటర్టైన్మెంట్Funky box office collection : డిజాస్టర్ దిశగా విశ్వక్ సేన్ 'ఫంకీ'..మొదటి రోజు ఓపెనింగ్స్...

Funky box office collection : డిజాస్టర్ దిశగా విశ్వక్ సేన్ ‘ఫంకీ’..మొదటి రోజు ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయంటే!

Funky box office collection : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో మార్కెట్ మొత్తాన్ని నాశనం చేసుకున్న విశ్వక్ సేన్(Vishwak Sen), ‘ఫంకీ'(Funky Movie) చిత్రం తో భారీ కం బ్యాక్ ఇస్తాడని అంతా ఆశించారు. ఎందుకంటే ఈ చిత్రానికి ‘జాతి రత్నాలు’ లాంటి బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన అనుదీప్ KV దర్శకత్వం వహించడం వల్లే. ఆయన కామెడీ టైమింగ్ తో రాసే పంచులకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. టీజర్, ట్రైలర్ మరియు […]

Funky box office collection : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో మార్కెట్ మొత్తాన్ని నాశనం చేసుకున్న విశ్వక్ సేన్(Vishwak Sen), ‘ఫంకీ'(Funky Movie) చిత్రం తో భారీ కం బ్యాక్ ఇస్తాడని అంతా ఆశించారు. ఎందుకంటే ఈ చిత్రానికి ‘జాతి రత్నాలు’ లాంటి బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన అనుదీప్ KV దర్శకత్వం వహించడం వల్లే. ఆయన కామెడీ టైమింగ్ తో రాసే పంచులకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. టీజర్, ట్రైలర్ మరియు పాటలు కూడా ఆడియన్స్ ని ఆకర్షించడంతో ఈ చిత్రం మంచి అంచనాల నడుమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ మొదటి ఆట నుండే ఘోరమైన టాక్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. సినిమా ఒక ఫ్లో లో పోకుండా, పిచ్చి పిచ్చి పంచులతో ఆడియన్స్ కి చిరాకు కలిగించారని, హీరో విశ్వక్ సేన్ కి మరో ఫ్లాప్ వచ్చేలా ఉందని ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు.

అందరూ ఊహించినట్టుగానే ఈ చిత్రం డిజాస్టర్ వైపు అడుగులు వేస్తోంది. విశ్వక్ సేన్ గత చిత్రం ‘లైలా’ కి వచ్చినంత ఓపెనింగ్ కూడా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో వచ్చేలా కనిపించడం లేదు. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 1200 టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోతున్నాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అనేది. విశ్వక్ సేన్ సోలో సినిమాకు ఇంత తక్కువ టిక్కెట్లు అమ్ముడుపోతే ఎలాంటి ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఆయన వరుస ఫ్లాప్స్ లో ఉన్నాడు కాబట్టి, అతని పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కానీ అనుదీప్ KV దర్శకత్వం వహించిన ‘జాతి రత్నాలు’ చిత్రానికి ఒక్క తెలంగాణ ప్రాంతం నుండే 15 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చేసిన తెలుగు సినిమా అయినప్పటికీ ఈ చిత్రానికి ఇంత తక్కువ ట్రెండ్ ఉండడం దురదృష్టకరం.

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తుంటే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 1 కోటి 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చేలా అనిపిస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. షేర్ వసూళ్లు 80 లక్షల వరకు ఉండొచ్చు. ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి 22 కోట్ల రూపాయలకు జరిగింది. ఆ రేంజ్ బిజినెస్ కి ఇలాంటి ఓపెనింగ్ ని చూస్తుంటే, ఈ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ దిశగా అడుగులు వేస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కానీ ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు ప్రీమియర్ షోస్ నుండి నమోదు అయ్యాయి అనే చెప్పొచ్చు. దాదాపుగా లక్షా 20 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ మాత్రం కాస్త అనుదీప్ మ్యాజిక్ వర్కౌట్ అయ్యింది అనే చెప్పాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper