spot_img
Homeఎంటర్టైన్మెంట్Balakrishna Wedding- NTR: బాలయ్య పెళ్ళికి ఎన్టీఆర్ హాజరు కాకపోవడానికి కారణం ఇదా..ఇదేమి పిచ్చి అండీ...

Balakrishna Wedding- NTR: బాలయ్య పెళ్ళికి ఎన్టీఆర్ హాజరు కాకపోవడానికి కారణం ఇదా..ఇదేమి పిచ్చి అండీ బాబోయ్!

Balakrishna Wedding- NTR: తెలుగు చలన చిత్ర పరిశ్రమ కి నటన అంటే ఏంటో నేర్పించిన మహానుభావుడు నందమూరి తారకరామారావు. పురాణ పాత్రలకు ప్రాణం పోసి, రాముడు అంటే ఇలా ఉంటాడా, కృష్ణుడు అంటే ఇలా ఉంటాడా అని కోట్లాది మంది తెలుగు ప్రజలు ఆయన చేసిన పాత్రల ఫోటోలను ఇళ్లల్లో పెట్టుకొని పూజించే స్థాయికి ఎదిగిన కారణజన్ముడు ఆయన. ఆ తర్వాత కొన్నాళ్ళకు తెలుగు దేశం పార్టీ ని స్థాపించి,9 నెలల్లోనే 270 కి పైగా అసెంబ్లీ స్థానాలను గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధీష్టించి ఎన్నో సేవలు అందించాడు.

తెలుగువాడి ఆత్మగౌరవాన్ని వెలుగెత్తి చాటాడు.అంత గొప్ప మనిషి గురించి మనకి తెలియనిదంటూ ఏదీ లేదు,ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది. ఇటీవలే ఎన్టీఆర్ శత దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవం గా జరిగిన సందర్భంగా ఎన్టీఆర్ గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయాన్నీ మీ ముందు ఉంచబోతున్నాము.

ఎన్టీఆర్ కి 8 మంది కుమారులు మరియు నలుగురు కుమార్తెలు ఉన్నారు, అందరిలోకి చిన్నవాడు నందమూరి బాలకృష్ణ. ఈయనని ఎన్టీఆర్ ఎంతో అల్లారు ముద్దుగా పెంచాడు, అంత ప్రేమగా పెంచుకున్న చిన్న కుమారుడి పెళ్ళికి ఎన్టీఆర్ రాలేదు అనే విషయం ఎవరికైనా తెలుసా..?, నిజంగానే ఆయన సమక్షం లో ఈ పెళ్లి జరగలేదు.ఎన్టీఆర్ కి మరియు బాలయ్య కి ఏమైనా మనస్పర్థలు ఏర్పడ్డాయి ఏమో అని మీరు అనుకోవచ్చు, కానీ అసలు విషయం ఏమిటంటే ఎన్టీఆర్ చైతన్య రథం యాత్రలో ఉన్న సమయం లోనే బాలయ్య పెళ్లి కుదిరింది.

యాత్ర మధ్యలో ఆపి వస్తే ఒకరోజు అనవసరం గా వృధా అవుతుంది, కార్యకర్తల ఏర్పాట్లు మొత్తం వేస్ట్ అవుతాయి అనే ఉద్దేశ్యం తోనే ఎన్టీఆర్ బాలయ్య పెళ్ళికి రాలేదట. ఇది ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలో కూడా చూపిస్తారు. దీనిని బట్టీ అర్థం చేసుకోవచ్చు ఎన్టీఆర్ ప్రజాక్షేత్రం లో ఉన్నప్పుడు సొంత కుటుంబాన్ని కూడా పట్టించుకోడు, కేవలం ప్రజలే ఆయనకీ ముఖ్యం అనే విషయం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
Oktelugu Epaper