Chiranjeevi: ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలిసి కోటి రూపాయిల విరాళం అందించిన సంగతి తెలిసిందే. విజయవాడ వరద బాధితులకు సహాయార్థంగా ఆయన తన తరుపున నుండి 50 లక్షల రూపాయిలు, కొడుకు రామ్ చరణ్ తరుపున నుండి మరో 50 లక్షల రూపాయిలు, మొత్తం కోటి రూపాయిల విరాళం ప్రకటించి చాలా రోజులు అయ్యింది. ఇటీవలే ఆ కోటి రూపాయిల చెక్ ని హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసం కి వెళ్లి తన చేతుల మీదుగా చంద్రబాబు నాయుడు కి అందించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అయితే ఈ ఫోటోలు చూసినప్పుడు అందరి ద్రుష్టి చిరంజీవి, చంద్రబాబు నాయుడు మీద ఉంటే, కొంతమంది ఆయన అభిమానులకు మాత్రం చిరంజీవి చెప్పుల మీదకు ద్రుష్టి వెళ్ళింది.
తమ అభిమాన హీరో ధరించే ప్రతీ వస్తువుని కొనాలని ఎదురు చూసే అభిమానులు, చిరంజీవి ధరించిన ఆ చెప్పులను కొనుగోలు చేసేందుకు గూగుల్ లో వెతికారు. అయితే ఆ చెప్పుల ధర చూసిన తర్వాత అభిమానులకు మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. ఆ చెప్పుల ధర దాదాపుగా రెండు లక్షల రూపాయిలు ఉంటుందని గూగుల్ లో తెలిసింది. సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు అయితే అలాంటి ఖరీదైన చెప్పులను కొనుగోలు చేయలేరు, కానీ బాగా డబ్బున్న వాళ్ళు మాత్రం ఇలా డిఫరెంట్ గా అనిపించిన వాటిని కొనుగోలు చేస్తారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాళ్లకు రెండు లక్షల రూపాయిలు ఇస్తే తమ ఇంటి ఖర్చుల కోసం వాడుకుంటారు. లేదా అదే రెండు లక్షల రూపాయలలో లగ్జరీ కావాలని కోరుకుంటే సెకండ్ హ్యాండ్ లో ఒక కారు ని కొనుక్కుంటారు. అంతే తప్ప రెండు లక్షల రూపాయిలు పెట్టి వాచీలు, చెప్పులు వంటివి కొనుగోలు చేయలేరు. ఈ చెప్పులను చిరంజీవి ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నాడట. ఇక మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన వసిష్ఠ దర్శకత్వం లో ‘విశ్వంభర’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.
ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. కేవలం గ్రాఫిక్స్ వర్క్ మరియు ఒక పాట చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఇకపోతే రీసెంట్ గా దసరా కానుకగా విడుదల చేసిన టీజర్ కి ఆడియన్స్ నుండి నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ముఖ్యంగా గ్రాఫిక్స్ దారుణంగా ఉన్నాయని, భారీ బడ్జెట్ అన్నారు, చూస్తుంటే గ్రాఫిక్ టీవీ సీరియల్స్ కి పెట్టినంత బడ్జెట్ కూడా పెట్టలేదంటూ సోషల్ మీడియా లో ట్రోల్స్ వేశారు. అయితే పూర్తి స్థాయి VFX వర్క్ ఇంకా మొదలు అవ్వలేదని, కేవలం ఆ టీజర్ కోసం మాత్రమే ప్రత్యేకంగా VFX చేయించి వదిలారని, అందుకే ఔట్పుట్ అలా వచ్చిందంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Do you know the price of these sandals worn by chiranjeevi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com