Homeఎంటర్టైన్మెంట్Srinu Vaitla: మహేష్ బాబు, ఎన్టీయార్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆ డైరెక్టర్...

Srinu Vaitla: మహేష్ బాబు, ఎన్టీయార్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆ డైరెక్టర్ ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలతో చేస్తున్నాడా..?

Srinu Vaitla: సినిమా ఇండస్ట్రీలో ఏ రోజు ఎవ్వరు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారనేది ఎవ్వరు ఊహించలేరు. ఈరోజు స్టార్లుగా గుర్తింపు పొందుతూ రాజభోగాలను అనుభవించే హీరోలు రేపటికి ప్లాప్ హీరోలుగా మారిపోవచ్చు. ఇక ఈ రోజు ప్లాపుల్లో ఉన్న వాళ్ళు రేపు స్టార్ స్టేటస్ అనుభవించవచ్చు. అందుకే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది కామన్… ప్రస్తుతం స్టార్ హోదాని అనుభవిస్తున్న చాలా మంది హీరోలు చెప్పే మాట కూడా ఇదే వాళ్ళు హిట్ వచ్చిన, ఫెయిల్యూర్ వచ్చిన ఒకే విధంగా స్పందిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ల కెరియర్ అనేది ఇక్కడ ఎక్కువ రోజుల పాటు కొనసాగే అవకాశాలుంటాయి. అలాగే వాళ్ళు హిట్టుకు పొంగిపోరు, ఫ్లాప్ వస్తే కుంగి పోరు. ఇక హిట్ ప్లాప్ ను పట్టించుకునే మెంటాలిటీ ఉండకపోవడం వల్లే వాళ్ళు డిప్రెషన్లకు పోయే అవకాశం కూడా లేకుండా పోతుంది. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చాడు. ఇక ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారా.? శ్రీను వైట్ల…ఇక ప్రస్తుతం ఈయన గోపీచంద్ హీరోగా విశ్వం అనే సినిమా చేస్తున్నాడు. అయితే శ్రీను వైట్ల ఒకప్పుడు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలను చేశాడు.

ఇక ఆ తర్వాత మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో కూడా సినిమాలు తీసి మెప్పించాడు. ఇక ఇలాంటి సందర్భంలో శ్రీను వైట్ల గత కొన్ని సంవత్సరాల నుంచి తన ఫామ్ ను అందుకోలేకపోతున్నాడు. ఈయన తీసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో ప్రస్తుతం ఆయనకు సినిమాని ఇచ్చే ప్రొడ్యూసర్స్ కూడా కరువయ్యారనే చెప్పాలి. ఇక ఎట్టకేలకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో గోపిచంద్ తో కలిసి ‘విశ్వం ‘ అనే సినిమా చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి లేనప్పటికీ ఇక ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఒక మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. అది చాలా ఆసక్తిగా ఉండటమే కాకుండా చాలా రిచ్ లొకేషన్లలో షూటింగ్ జరుపుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో మరోసారి శ్రీను వైట్ల కంబ్యాక్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అలాగే రీసెంట్ గా వచ్చిన మేకింగ్ వీడియో కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుందనే చెప్పాలి. ఇక శ్రీను వైట్ల ఒకప్పుడు కామెడీ సినిమాలు చేస్తూ ముందుకు సాగేవాడు. మరి ఇప్పుడు ఈ సినిమాను కూడా కామెడీ సినిమాగానే తెరకెక్కిస్తున్నారా? లేదంటే ఒక సీరియస్ ఎమోషనల్ సినిమా గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడా అనే విషయం మీదనే సరైన క్లారిటీ రావడం లేదు…ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే శ్రీను వైట్ల కి మళ్లీ పెద్ద హీరోల నుంచి అవకాశాలు రావాలంటే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ కొడితే తప్ప అది సాధ్యమయ్యే పని కాదు అంటూ ఇంకొంతమంది మేకర్స్ వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Oktelugu Epaper