Homeఎంటర్టైన్మెంట్Dhurandhar: 'దురంధర్' చిత్రం ఆ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిందా..? ఆడియన్స్ ని భలే మోసం...

Dhurandhar: ‘దురంధర్’ చిత్రం ఆ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిందా..? ఆడియన్స్ ని భలే మోసం చేశారుగా!

Dhurandhar: ఈ ఏడాది చివర్లో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ‘దురంధర్'(Dhurandhar Movie) చిత్రం కారణంగా కళకళలాడుతోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఆ టాక్ తో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద 560 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ ఏడాది విడుదలైన ఇండియన్ […]

Dhurandhar: ఈ ఏడాది చివర్లో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ‘దురంధర్'(Dhurandhar Movie) చిత్రం కారణంగా కళకళలాడుతోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఆ టాక్ తో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద 560 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ ఏడాది విడుదలైన ఇండియన్ సినిమాల్లో అత్యధిక గ్రాస్ ఈ చిత్రానికే వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో గా నటించిన రణవీర్ సింగ్(Ranveer Singh), విలన్ గా నటించిన అక్షయ్ ఖన్నా(Akshay Khanna) లకు వచ్చిన క్రేజ్ మామూలుది కాదు. 3 గంటల 45 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాని ఎక్కడా కూడా నిమిషం బోర్ కొట్టకుండా తెరకెక్కించడం లో డైరెక్టర్ ఆదిత్య దళ్ మరోసారి తన ప్రతిభ ని చాటుకున్నాడు. గతం లో ఆయన ఆర్టికల్ 370 , URI సర్జికల్ స్ట్రైక్ వంటి చిత్రాలను ఆయన రూపొందించాడు.

ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రాన్ని ఆదిత్య వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని , పాకిస్థాన్ కి వ్యతిరేకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అందుకే ఈ సినిమాపై పాకిస్థాన్ తో పాటు, మిడిల్ ఈస్ట్ లోని దేశాలు కూడా రుసరుసలాడాయి. ఫలితంగా అక్కడ విడుదలకు కూడా ఈ చిత్రం నోచుకోలేదు. అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ ని క్రియేట్ చేస్తూ ముందుకెళ్తున్న ఈ చిత్రం పై ఇప్పుడు ఒక ఆరోపణ వచ్చింది. ఈ సినిమా ఒక పాకిస్తానీ సినిమాకు కాపీ అని అంటున్నారు. ఇండియన్స్ మా సినిమాని కాపీ కొట్టి, మాపైనే సెటైర్లు వేస్తున్నారు అంటూ పాకిస్తాన్ కి చెందిన నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2022 వ సంవత్సరం లో వచ్చిన ‘అస్లాం చౌదరి’ అనే పాకిస్థానీ చిత్రాన్ని ఆధారంగా తీసుకొని ఈ దురంధర్ చిత్రాన్ని రూపొందించారని ఆ చిత్రం లో నటించిన ఖమర్ రెజా చెప్పుకొచ్చాడు.

అస్లామ్ అనే వ్యక్తి ఒక పోలీస్ ఆఫీసర్. 2014 వ సంవత్సరం లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆయన మరణించాడు. ఆయన జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన పాకిస్థానీ చిత్రం ‘అస్లామ్ చౌదరి’ ని ఆధారంగా తీసుకొని ఈ ‘దురంధర్’ చిత్రాన్ని రూపొందించినట్టు రెజా ఆరోపించాడు. ‘దురంధర్’ చిత్రం లో అస్లామ్ క్యారక్టర్ ని సంజయ్ దత్ పోషించి అద్భుతమైన మార్కులను ఆడియన్స్ నుండి కొట్టేసాడు. అయితే అసలే బాక్స్ ఆఫీస్ వద్ద సునామి లాగా దూసుకుపోతున్న ఈ చిత్రానికి, ఇలాంటి వివాదాలు నిప్పు మీద పోసిన పెట్రోల్ లాంటిది అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఊపు చూస్తుంటే ఈ చిత్రం అతి త్వరలోనే వెయ్యి కోట్ల మార్కుని అందుకునేలా అనిపిస్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper