Homeఎంటర్టైన్మెంట్Dhurandhar Closing Collections: 'ధురంధర్' వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్..చరిత్రలో ఇలాంటి వసూళ్ల సునామీని మళ్లీ...

Dhurandhar Closing Collections: ‘ధురంధర్’ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్..చరిత్రలో ఇలాంటి వసూళ్ల సునామీని మళ్లీ చూడలేం!

Dhurandhar Closing Collections: కొన్ని సినిమాలు హిట్ అవుతాయని ముందే ఊహిస్తాము, కానీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే రేంజ్ హిట్ అవుతుందని ఊహించలేము. మనమే కాదు, కష్టపడి ఆ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శక నిర్మాతలు కూడా ఊహించలేరు. ఈమధ్య కాలం లో ఇలాంటి సంఘటన ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం విషయం లో జరిగింది. విడుదలకు ముందు ఈ చిత్రం పై అనేక రూమర్స్ వినిపించేవి. నిర్మాతలు భారీ బడ్జెట్ ని ఖర్చు చేశారు, ఇప్పుడు వాళ్లకు విడుదల […]

Dhurandhar Closing Collections: కొన్ని సినిమాలు హిట్ అవుతాయని ముందే ఊహిస్తాము, కానీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే రేంజ్ హిట్ అవుతుందని ఊహించలేము. మనమే కాదు, కష్టపడి ఆ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శక నిర్మాతలు కూడా ఊహించలేరు. ఈమధ్య కాలం లో ఇలాంటి సంఘటన ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం విషయం లో జరిగింది. విడుదలకు ముందు ఈ చిత్రం పై అనేక రూమర్స్ వినిపించేవి. నిర్మాతలు భారీ బడ్జెట్ ని ఖర్చు చేశారు, ఇప్పుడు వాళ్లకు విడుదల చేయడానికి కుదరడం లేదు, అడ్వాన్స్ బుకింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయి, కచ్చితంగా డిజాస్టర్ ఓపెనింగ్స్ వస్తుంది, సినిమా పెద్ద ఫ్లాప్ అవుతుంది అంటూ రకరకాలుగా సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేశారు. అలాంటి ప్రతికూల పరిస్థితులలో విడుదలైన ఈ చిత్రం, మొదటి రోజు నుండి క్లోజింగ్ వరకు బాక్స్ ఆఫీస్ వద్ద రాబట్టిన వసూళ్లను చూసి ట్రేడ్ విమర్శించిన వాళ్లకు కూడా మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.

విడుదలై నేటికి 73 రోజులైంది. ఇప్పటికీ ఈ సినిమా నార్త్ ఇండియా లో నడుస్తూనే ఉంది. మరో పక్క నెట్ ఫ్లిక్స్ లో విడుదలై కేవలం పది రోజుల్లోనే 16 లక్షల వ్యూస్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. అయినప్పటికీ కూడా ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూస్తూనే ఉన్నారు జనాలు. అయితే నేటితో దాదాపుగా నార్త్ ఇండియా లో కూడా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ రన్ ముగిసినట్టే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి వచ్చిన క్లోజింగ్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఓవర్సీస్ విషయానికి వస్తే, అక్కడ ఈ చిత్రాన్ని మిడిల్ ఈస్ట్ దేశాల్లో విడుదల చేయనివ్వలేదు. బాలీవుడ్ సినిమాలకు భారీ మార్కెట్ ఇది. అయినప్పటికీ కూడా ఓవర్సీస్ నుండి ఈ చిత్రం 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది.

ముఖ్యంగా నార్త్ అమెరికా లో ఈ చిత్రం 20 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, ఆల్ టైం బాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిల్చింది. ఓవరాల్ గా చూస్తే ‘బాహుబలి 2’ తర్వాత టాప్ 2 గ్రాసర్ గా చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇండియా లో ఈ 73 రోజుల్లో ఈ చిత్రానికి 900 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు, 1070 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వరల్డ్ వైడ్ గా చూస్తే 1370 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. సీక్వెల్ క్రేజ్ లేకుండా, కేవలం హిందీ భాష నుండి ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు రావడం అనేది సాధారణమైన విషయం కాదు. మార్చి 19 న ఈ సినిమాకు కొనసాగింపుగా ‘ధురంధర్ 2 ‘ విడుదల కాబోతుంది. ఈ చిత్రం హిందీ తో పాటు తెలుగు, తమిళం మరియు ఇతర భాషల్లో కూడా విడుదల కాబోతుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper