Vikram Son Dhruv: తెలుగు వాళ్ళు అయ్యుండి,ఎంతో మంది తెలుగు నటీనటులు స్టైల్ కోసం పబ్లిక్ ఈవెంట్స్ లో ఇంగ్లీష్ మాట్లాడుతున్న రోజులివి. ఇక తమిళ ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్ళు అయితే ఎన్నో ఏళ్ళ నుండి వాళ్ళ సినిమాలను తెలుగు లో రిలీజ్ చేసుకుంటూ ఉన్నారు. కోట్ల రూపాయిలు సంపాదించారు. కానీ ఇప్పటి వరకు తెలుగు లో మాట్లాడలేదు. రీసెంట్ గా కాంతారా హీరో రిషబ్ శెట్టి అయితే మన తెలుగు రాష్ట్రంలోకి అడుగుపెట్టి కన్నడ లో ప్రసంగించాడు. ఇతనికి తెలుగు వచ్చు, అయినప్పటికీ కూడా కన్నడ లో మాట్లాడడం పై నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పర బాషా నుండి వచ్చిన వారిలో మన తెలుగు బాషాని బాగా ప్రేమించే ఏకైక హీరో కార్తీ మాత్రమే. ఈయన ఎన్నో సార్లు బహిరంగంగా తనకు తమిళ ఆడియన్స్ కంటే తెలుగు ఆడియన్స్ ఇష్టం వంటి కామెంట్స్ చేశారు.
అతని తర్వాత తెలుగు భాషకు అత్యంత గౌరవం ఇచ్చిన హీరో గా మనం తమిళ హీరో విక్రమ్(Chiyaan Vikram) కొడుకు ధృవ్ విక్రమ్(Dhruv Vikram) ని చూడొచ్చు. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బిసన్ కాలమాదాన్’. ఈ సినిమా తమిళం లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తెలుగు లో ఈ నెల 24 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మూవీ టీం మొత్తం పాల్గొనింది. ఈ ఈవెంట్ లో ధృవ్ తనకు తెలుగు రాకపోయినా కూడా, తెలుగు లో తన ప్రసంగాన్ని రాసుకొచ్చి మాట్లాడాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలను సోషల్ మీడియా లో నెటిజెన్స్ షేర్ చేస్తూ పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు. ఆయన మాట్లాడుతూ ‘ఇది నేను హైదరాబాద్ లో ప్రమోట్ చేస్తున్న మొదటి సినిమా. అందుకే నాకు ఇది చాలా స్పెషల్. నా పేరు ధృవ్’ అంటూ మొదలు పెట్టాడు.
ఇంకా కొనసాగిస్తూ ‘రీసెంట్ గా నేను ఒక సూట్ కేసు కొనడానికి మాల్ కి వెళ్లాను. షాప్ ఓనర్ తో నేను భేరం చేస్తుంటే బయట నుండి కొంతమంది నావైపు చూసి చేతులు ఊపుతున్నారు. వాళ్ళు మీ స్నేహితులా? అని షాప్ ఓనర్ ని అడిగారు,నేను కాదని చెప్పాను. మీరు సినిమాల్లో నటిస్తారా? అని అడిగారు, అవునని చెప్పాను,నాకు అప్పుడు గెడ్డం ఉంది. నన్ను అలా చూస్తూ మీరు యాక్టర్ విక్రమ్ లాగా ఉన్నారని అన్నారు. అప్పుడు నేను విక్రమ్ కొడుకుని అని సమాధానం చెప్పాను. వెంటనే మీ నాన్న గారి నటన అంటే చాలా ఇష్టమని, ఇండియా లోనే గొప్ప నటులలో ఒకరని అని నాన్న పై ఎంతో ప్రేమని చూపించారు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా మా నాన్న దేశవ్యాప్తంగా ఇంత పేరు తెచ్చుకున్నాడు. ఎదో ఒకరోజు నాకొడుకు కూడా ఇలా సూట్ కేసు కొనడానికి వచ్చినప్పుడు, వాళ్ళ నాన్న అయినటువంటి నా గురించి ఆ సూట్ కేసు ఓనర్ గొప్పగా మాట్లాడే స్థాయికి నేను వెళ్లాలని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు ధృవ్ విక్రమ్.
#DhruvVikram puts in more effort to speak Telugu than others who exploit the Telugu market without any presence.#Bison pic.twitter.com/bAsZQy8lZf
— Gulte (@GulteOfficial) October 21, 2025