Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh music director change: 'ఉస్తాద్ భగత్ సింగ్' నుండి దేవిశ్రీ ప్రసాద్...

Ustaad Bhagat Singh music director change: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి దేవిశ్రీ ప్రసాద్ వాకౌట్..? కొత్తగా ఆ మ్యూజిక్ డైరెక్టర్ కి బాధ్యతలు!

Ustaad Bhagat Singh music director change: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) , దేవిశ్రీ ప్రసాద్(Devisri Prasad) కాంబినేషన్ లో సినిమా అంటే అభిమానుల్లో అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి, ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్ లో ఇప్పటి వరకు వచ్చిన జల్సా , గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాలు మ్యూజికల్ గా పెద్ద సంచలనాలను సృష్టించాయి. అలాంటి చార్ట్ బస్టర్స్ వీళ్ళ కాంబినేషన్ నుండి వచ్చాయి కాబట్టే, ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘(Ustaad Bhagat Singh) మ్యూజిక్ పై అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. కానీ వాళ్ళ ఆశలపై దేవిశ్రీ ప్రసాద్ నీళ్లు చల్లాడు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి రెండు పాటలు విడుదల అయ్యాయి. అందులో ‘దేఖ్లేంగే సాలా’ పాటకు యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం పవన్ కళ్యాణ్ డ్యాన్స్ వల్లే ఈ పాటకు యూట్యూబ్ లో 50 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

దేవిశ్రీ ప్రసాద్ రొటీన్ ట్యూన్ కాకుండా, కాస్త మంచి ట్యూన్ ఇచ్చి ఉంటే ఈ పాటికి ఆ సాంగ్ కు 100 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చి ఉండేవని విశ్లేషకుల అభిప్రాయం. ఇక రీసెంట్ గా విడుదల చేసిన ‘#AuraOfUstad’ పాటకు అయితే డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చింది. అభిమానులు కూడా ఈ పాటపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీ కి నాసిరకమైన పాటలు ఇచ్చాడు, పెద్ద దెబ్బేశాడు అంటూ అభిమానులు సోషల్ మీడియా లో పెద్ద రచ్చ చేసేసారు. ఇంకా ఈ చిత్రం నుండి రెండు పాటలు విడుదల అవ్వాల్సి ఉంది. ఈ పాటలు ఎలా ఉంటాయో అని ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి సంబంధించిన రీ రికార్డింగ్ వర్క్ జరుగుతోంది. అయితే దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న బ్యా గ్రౌండ్ స్కోర్ డైరెక్టర్ హరీష్ శంకర్ కి ఏ మాత్రం నచ్చడం లేదని టాక్.

Also Read: హరీష్ శంకర్ కి బాలయ్య డేట్స్ ఇవ్వడం లేదా..? కారణం తెలిస్తే షాక్ అవుతారు..?

రీ వర్క్ చేయమంటే దేవిశ్రీప్రసాద్ చాలా ఆలస్యంగా ఔట్పుట్ ని అందిస్తున్నాడట. దీంతో మేకర్స్ రీ రికార్డింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వరకు దేవి శ్రీ ప్రసాద్ ని ఈ సినిమా నుండి తప్పించి , తమన్ కి అప్పగించే ఆలోచనలో ఉన్నారట. గతంలో కూడా ‘పుష్ప 2’ కి ఇదే జరిగింది. సమయానికి దేవిశ్రీ ప్రసాద్ ఔట్పుట్ ఇవ్వకపోవడం , ఇచ్చిన ఔట్పుట్ లో ఎక్కువ కరెక్షన్స్ ఉండడం, సమయం బాగా వృధా అవుతుండడం వల్ల, దేవిశ్రీ ప్రసాద్ ని రీ రీకార్డింగ్ వర్క్ నుండి తప్పించి తమన్ తో పని చేయించారు. కానీ ఆయన ఇచ్చిన ట్యూన్స్ కూడా పెద్దగా నచ్చకపోవడం తో చివరికి దేవిశ్రీప్రసాద్ తోనే పూర్తి చేయించారు. అదే సీన్ ఇప్పుడు రిపీట్ కాబోతుంది. ఈ చిత్రం రీ రికార్డింగ్ వర్క్ తమన్ చేతుల్లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular