Harish Shankar Balakrishna movie news: ‘నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది’… అంటూ పవన్ కళ్యాణ్ కి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందించిన దర్శకుడు హరీష్ శంకర్… 10 సంవత్సరాల పాటు ప్లాపుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా చేసి పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి తీర్చిన దర్శకుడు.. ఈయన చేసే సినిమా కథలో పెద్దగా కొత్తదనం ఉండదు. అయిన ట్రీట్మెంట్ లో వైవిధ్యాన్ని చూపిస్తూ ఎమోషన్స్ ను ఎలివేషన్స్ ను బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం ఆయన నైజం…గబ్బర్ సింగ్ తర్వాత ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఈనెల 26 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా నెక్స్ట్ లెవల్లో సక్సెస్ ను సాధిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. గత సంవత్సరం వచ్చిన ‘ఓజీ’ సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేసింది. ఇక ఆ సినిమా యొక్క రికార్డులను తిరగరాసేలా ఈ సినిమా ఉంటుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి పెద్ద చిక్కుముడి వీడినట్టే..ఇక పాజిటివ్ టాక్ రావడమే బ్యాలన్స్!
ఈ సినిమా తర్వాత బాలయ్య బాబుతో ఒక సినిమా చేయాలని హరీష్ శంకర్ అతనికి కథనైతే వినిపించాడట. కానీ బాలయ్య నుంచి గ్రీన్ సిగ్నల్ రానట్టుగా తెలుస్తుంది. కారణం ఏంటి అంటే హరీష్ శంకర్ సినిమాలను బాగా డీల్ చేసినప్పటికి బాలయ్య తాలూకు ఇమేజ్ ఉన్న వ్యక్తి యొక్క పొటాషియాల్టీని పూర్తిస్థాయిలో వాడుకుంటాడా? లేదా అనే ఉద్దేశ్యంతోనే ఆయన కథకి ఇంకా బాలయ్య ఎస్ చెప్పలేదట.
ఇక ఎట్టకేలకు ఈ సినిమా కనక ఒకే అయితే మాత్రం బాలయ్యలోని పూర్తి నటుడిని బయటికి తీస్తానని హరీష్ శంకర్ చెబుతున్నప్పటికి అతను సినిమాను ఎలా హ్యాండిల్ చేస్తాడు అనే విషయంలో క్లారిటీ మిస్ అవుతుంది. కాబట్టి బాలయ్య తనకు డేట్స్ ఇవ్వడం లేదని తన సన్నిహిత వర్గాల దగ్గర చెబుతున్నాడట… ఫైనల్ గా ఏం జరగబోతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తర్వాత హరీష్ శంకర్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…