Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి తమ్ముడిగా నటించబోతున్న క్రేజీ యంగ్ హీరో..ఇది కదా కాంబినేషన్...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి తమ్ముడిగా నటించబోతున్న క్రేజీ యంగ్ హీరో..ఇది కదా కాంబినేషన్ అంటే!

Pawan Kalyan: మార్చి నెల పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులకు ఒక పండగ లాంటి నెల అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ నెల 26వ తేదీన వాళ్ళు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh Movie) చిత్రం విడుదల కాబోతుంది. అదే నెలలో ఉగాది పర్వదినాన పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రారంభం కాబోతుంది. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు, వక్కంతం వంశీ […]

Pawan Kalyan: మార్చి నెల పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులకు ఒక పండగ లాంటి నెల అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ నెల 26వ తేదీన వాళ్ళు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh Movie) చిత్రం విడుదల కాబోతుంది. అదే నెలలో ఉగాది పర్వదినాన పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రారంభం కాబోతుంది. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు, వక్కంతం వంశీ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. వీళ్లిద్దరు ప్రస్తుతం ఫ్లాప్స్ లోనే ఉన్నారు, స్టార్ హీరోలెవ్వరూ వీళ్ళతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించరు, కానీ పవన్ కళ్యాణ్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎందుకు అలాంటోళ్ళతో సినిమా చేస్తున్నాడు అని సోషల్ మీడియా అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ సాగింది. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉన్న బిజీ పరిస్థితుల్లో, ఆయన డేట్స్ చాలా కంప్లికేటెడ్ గా ఇస్తాడు.

ఆ డేట్స్ కి అడ్జస్ట్ అవ్వగలిగే డైరెక్టర్స్ ఇలా ఖాళీగా ఉన్న సురేందర్ రెడ్డి లాంటి వాళ్ళు మాత్రమే. టాప్ డైరెక్టర్స్ తో ఇలాంటివి వర్కౌట్ అవ్వవు. అందుకే పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి ని ఎంచుకున్నాడు. అయితే సురేందర్ రెడ్డి చాలా మంది టాలెంటెడ్ డైరెక్టర్. ఆయన కెరీర్ లో ఫ్లాప్స్ ఉండొచ్చు కానీ, చెత్త సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘ఏజెంట్’ మాత్రమే. ఆ సినిమాకు కూడా ఆయన పూర్తి స్థాయిలో దర్శకత్వం వహించలేదని అంటుంటారు. అయితే ఇది సురేందర్ రెడ్డి కి కం బ్యాక్ ఇవ్వడానికి అద్భుతమైన అవకాశం. అందుకే ఈ చిత్రాన్ని చాలా భారీగా ప్లాన్ చేస్తున్నాడు, ఎక్కడా కూడా అసలు తగ్గడం లేదు. క్యాస్టింగ్ కూడా భారీగానే ఉంటుంది. ఇకపోతే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ లాగా కనిపించబోతున్నాడు అనే సంగతి మన అందరికి తెలిసిందే.

అంతే కాదు, ఇది ఒక అన్నదమ్ముల కథ అట. ఇందులో పవన్ కళ్యాణ్ కి తమ్ముడిగా మరో హీరో నటించబోతున్నాడని టాక్. నాని లేదా విజయ్ దేవరకొండ వంటి హీరోలను సంప్రదించే ప్రయత్నం లో ఉన్నారట మేకర్స్. ఒకవేళ వారిలో ఎవరో ఒకరు ఒప్పుకొని ఈ సినిమా చేస్తే మాత్రం ఎవ్వరి ఊహలకు అందనంత రేంజ్ కి అంచనాలు చేరుకుంటాయి. కేవలం టాక్ వస్తే చాలు, పాన్ ఇండియా లెవెల్ లో రికార్డ్స్ మోత మోగుతాయి. మరి వీరిద్దరిలో ఎవరో ఒకరు ఒప్పుకుంటారా లేదా?, ఒకవేళ ఇద్దరూ ఒప్పుకోకపోతే ఏ హీరో ని సంప్రదిస్తారు అని సోషల్ మీడియా లో చర్చించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. రాబోయే రోజుల్లో ఈ చిత్రం పై ఎవ్వరూ ఊహించనంత అంచనాలు ఏర్పడుతాయి అనడం లో ఎలాంటి సందేహాలు లేవు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper