ఎంటర్టైన్మెంట్Ram Gopal Varma: పిలిచినా రానంటావా.. పోలీస్ విచారణను ఎగ్గొట్టిన వర్మ.. వాట్సాప్ లో ఏం...

Ram Gopal Varma: పిలిచినా రానంటావా.. పోలీస్ విచారణను ఎగ్గొట్టిన వర్మ.. వాట్సాప్ లో ఏం మెసేజ్ పెట్టాడంటే?

Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఆయన రాజకీయ విమర్శలు చేశారు. జగన్ ప్రత్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు కొనసాగించారు.సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు పెట్టి చాలా రకాల కామెంట్స్ చేశారు. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడంతో ఆయనపై ఎటువంటి కేసులు నమోదు కాలేదు. కానీ ఇప్పుడు వరుస పెట్టి కేసులు నమోదవుతున్నాయి. ప్రకాశం జిల్లాలో నమోదైన ఒక కేసుకు సంబంధించి ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. విచారణకు హాజరు కావాలన్నది ఆ నోటీసుల సారాంశం. ఇంతలో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై మోపిన కేసును కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే గతంలో రాంగోపాల్ వర్మ పెట్టిన సోషల్ మీడియా పోస్టులు చూసిన న్యాయమూర్తులు ఆయన పిటిషన్ ను రద్దు చేశారు. అరెస్టు చేయకుండా ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. దీంతో రాంగోపాల్ వర్మ లో ఒక రకమైన ఆందోళన ప్రారంభం అయింది. ఇప్పుడు ఆయన ముందున్న ఏకైక మార్గం బెయిల్ పిటిషన్. ప్రస్తుతం ఆ ప్రయత్నాల్లోనే ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పోలీస్ విచారణకు డుమ్మా కొట్టారు. తనకు నాలుగు రోజుల సమయం కావాలని ఏకంగా పోలీసులకు మెసేజ్ రూపంలో సమాచారం ఇచ్చారు.

* అప్పట్లో అనుచిత వ్యాఖ్యలు
అప్పటి సీఎం జగన్ జీవితాన్ని ఇతివృత్తంగా చేసుకొని రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే చిత్రాన్ని రూపొందించారు. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై పెట్టిన పోస్టులు వివాదాస్పదం అయ్యాయి. వీరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ అప్పట్లో వర్మ పెట్టిన పోస్టులపై ప్రకాశం జిల్లాలో కేసులు నమోదయ్యాయి. అందుకే కేసు విచారణకు ఈరోజు హాజరు కావాలని కోరుతూ పోలీసులు నోటీసులు అందించారు. కానీ ఈరోజు విచారణకు రామ్ గోపాల్ వర్మ హాజరు కాలేదు. తనకు నాలుగు రోజుల సమయం కావాలని ఆయన కోరడం విశేషం. అది కూడా తనదైన స్టైల్ లో వాట్సాప్ లో పోలీసులకు ఈ సమాచారం అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

* అరెస్టుకు రంగం సిద్ధం
మరోవైపు రాంగోపాల్ వర్మ అరెస్ట్ కు రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నట్లు సమాచారం. చివరి నిమిషంలో రాంగోపాల్ వర్మ విచారణకు గైర్హాజరు అయ్యారు. క్వాష్ పిటిషన్ కొట్టివేత సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవసరమైతే బెయిల్ తెచ్చుకోవచ్చని సూచించింది. ఈ సూచనలను అనుసరించి రామ్ గోపాల్ వర్మ నాలుగు రోజుల సమయాన్ని పోలీసులకు అడిగినట్లు తెలుస్తోంది. ఒకవేళ పోలీసులు అరెస్ట్ కు సిద్ధంగా ఉంటే.. మాత్రం ఈ క్షణంలోనైనా అరెస్టు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం నాలుగు రోజులు ఆగే సూచనలు కనిపిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Sandeep Reddy Vanga: వర్మ చిందులు.. సందీప్ వంగ ఈలలు.. గూస్ బంప్స్ రప్పిస్తున్న వీడియో..

Sandeep Reddy Vanga: ఇప్పటి తరానికి సందీప్ వంగ ఎలాగో , అప్పటి తరానికి రామ్ గోపాల్ వర్మ అలా అన్నమాట. ఇద్దరూ ఒకే స్కూల్ కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళ టేకింగ్...

Trivikram Srinivas: త్రివిక్రమ్ ను బెదిరించిన ఆర్జీవీ… అందుకే వాళ్లిద్దరి మధ్య మాటలు లేవు…

Trivikram Srinivas: శివ సినిమాతో ఒక్కసారిగా పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ... మొదటి సినిమా తోనే ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన ఆయన ఆ తదుపరి...

YCP: వైసిపి కఠిన నిర్ణయం

Most Popular

Tollywood Directors

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...
Jana Nayagan

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...
OG TV Telecast

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...
Hyper Aadi

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...
The Paradise

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...