spot_img
Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi And Ram Charan: వాయనాడు బాధితుల కోసం ముందుకొచ్చిన రామ్ చరణ్ చిరంజీవి.. గొప్ప...

Chiranjeevi And Ram Charan: వాయనాడు బాధితుల కోసం ముందుకొచ్చిన రామ్ చరణ్ చిరంజీవి.. గొప్ప సాయం…

Chiranjeevi And Ram Charan: సినిమా ఇండస్ట్రీ అనేది కేవలం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికే కాకుండా జనాలకు ఆపద వచ్చిన సమయంలో మన హీరోలు వాళ్ళ కు తోచినంత సహాయాన్ని చేస్తూ ప్రజలను కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే స్టార్ హీరోలు వరదలు గాని లేదా ఏవైనా విపత్కర పరిస్థితులు ఏర్పడిన సందర్భాల్లో గానీ వాళ్ల దయా గుణాన్ని చాటుకుంటూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన వ్యక్తిగతంగా చాలా మందికి సహాయాన్ని అందజేస్తూ ఉంటాడు. కానీ ఆ విషయాలను మాత్రం బయటికి చెప్పడానికి ఆయన ఇష్టపడడు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటీనటులకు కూడా ఆయన ఆర్థికంగా హెల్ప్ చేశారంటూ సహాయం పొందిన ప్రతి ఒక్కరు ఆయనకు కృతజ్ఞతలు చెబుతుంటారు. అలాంటి చిరంజీవి మెగాస్టార్ అవ్వడంలో సినిమాలు మాత్రమే కాకుండా ఆయన వ్యక్తిత్వం కూడా ఆయనకి హెల్ప్ చేసిందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే కేరళలోని వయనాడ్ బాధితులకు ప్రస్తుతం ఆయన తన కొడుకు అయిన రామ్ చరణ్ ఇద్దరూ కలిసి సిఎంఆర్ఎఫ్ కి కోటి రూపాయల విరాళాన్ని అందజేశారు.

ఇక ఇప్పటికే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో కూడా వాళ్లకు 25 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాడు. ఇక ఏది ఏమైనప్పటికీ మన హీరోలు మన దగ్గరనే కాకుండా పక్క రాష్ట్రాల్లో వరదలు లేదా విపత్కర పరిస్థితులు ఎదురైన ప్రతీసారి ఏదో ఒక రకంగా స్పందిస్తూనే ఉంటారు. ఇక ఇదిలా ఉంటే కరోనా సమయంలో కూడా చిరంజీవి చాలా వరకు సినీ కార్మికులను ఆదుకున్నాడు. సినిమా షూటింగ్ లు లేక తినడానికి తిండి కూడా దొరకక ఇబ్బంది పడిన చాలామందికి చిరంజీవి చేయూతనిస్తూ వాళ్ల కుటుంబాల్లో ఆనందాన్ని నింపాడు.

ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ఎంత మాట్లాడిన అది తక్కువే అవుతుంది. ఇప్పుడనే కాదు ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కూడా తనకు తినడానికి డబ్బులు ఇబ్బందు అయినా సమయంలో కూడా ఆయన దగ్గర ఉన్న మనీని అడ్జస్ట్ చేసుకుంటూ మిగతా వాళ్లకు సాయం చేసిన రోజులు కూడా ఉన్నాయి…ఇక మొత్తానికైతే చిరంజీవి ఇప్పటికి కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని కూడా సొంతం చేసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన విశ్వంభర సినిమా చేస్తూ చాలా బిజీగా గడుపుతున్నాడు.

ఇక ఈ సినిమాతో మరోసారి వైవిద్యమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తను కనక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటే మాత్రం చిరంజీవి మేనియా మరోసారి ఇండస్ట్రీలో కొనసాగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక తన వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఎదగడమే కాకుండా గ్లోబల్ స్టార్ గా కూడా కీర్తి ప్రతిష్టలను అందుకున్నాడు.. త్రిబుల్ ఆర్ సినిమాతో ఒక్కసారిగా ఫ్యాన్ ఇండియాలో స్టార్ హీరోగా ఎదిగిన రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాతో మరోసారి భారీ బ్లాక్ బస్టర్ ను అందుకోవడానికి సిద్ధమవుతున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

AP Rain Alert

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...
Polavaram Project

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...
Sonam Wangchuk

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...
Pakistan Economy

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper